తెలుగు లో ఉన్న బడ ప్రొడ్యూసర్లలో అల్లు అరవింద్ కూడా ఒకరు. గీత ఆర్ట్స్ బ్యానర్ మీద ఎన్నో చిత్రాలను తెరకెక్కిస్తూ మంచి విజయాలను అందుకున్నారు. కెరియర్ మొదట్లో కేవలం మెగా హీరోలతో మాత్రమే సినిమాలను తీసిన ఇప్పుడు టాలీవుడ్ అందరి హీరోలతో సినిమాలు చేస్తూ బాగానే పేరు సంపాదిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు తెరకు ఎంతోమంది దర్శకులు కూడా పరిచయం చేయడం జరిగింది. తాజాగా 2018 సినిమా సక్సెస్ మీట్ లో పాల్గొన్న అల్లు అరవింద్ కొంతమంది దర్శకుల పైన సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇప్పుడు ఆ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది తాజాగా జరిగిన 2018 సినిమా ఈవెంట్లో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. నేను ఇక్కడికి రాగానే డైరెక్టర్ చందు మొండేటి బన్నీ వాసుతో కలిసి ఒక ఫోటో దిగాను . అది ఎందుకో ముందు చెప్తాను.. డైరెక్టర్ చందు మొండేటి కార్తికేయ 2 కంటే ముందు మాతో రెండు సినిమాలకు కమిట్ అయ్యారు.. ఆ కారణంగా ఆ తర్వాత అతడికి ఎన్నో ఆఫర్లు వచ్చిన మా గురించి దేన్ని అసలు ఒప్పుకోలేదని తెలియజేశారు. ఆ తర్వాత ఆయన కంటిన్యూ చేస్తూ చందు మండేటి చాలా గొప్ప డైరెక్టర్ అవుతారని భావించి నేను రెండు సినిమాలకు ముందుగానే బుక్ చేసుకున్నానని తెలిపారు.


ఎంతోమంది నిర్మాతలు భారీ ఆఫర్లు ఇచ్చిన కూడా అతడు కేవలం మాటకి కట్టుబడి ఉన్నాడు.. కానీ నా ద్వారా పైకి వచ్చిన కొంతమంది దర్శకులు పేర్లు చెప్పను కానీ వాళ్లు గీత దాటి వెళ్లి పని చేసుకుంటున్నారని తెలిపారు. కానీ ఈయన ఇక్కడే నిలబడి ఉన్నారని తెలిపారు అల్లు అరవింద్. ప్రస్తుతం అల్లు అరవింద్ మాట్లాడిన ఆదర్శకుల పేరు ఎవరా అంటూ సినీ ప్రేక్షకులంతా చర్చలు జరుపుతున్నారు. కొంతమంది పరోక్షంగా డైరెక్టర్ పరుశురామంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: