
నిన్నటికీ నిన్న హల్దీ వేడుకలకు సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ గా మారడంతో పాటు తాజాగా సంగీతికి సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మారుతోంది. ఈ సంగీత్ వేడుకలలో సర్వ అదరగొట్టేసాడని చెప్పవచ్చు. అమ్మాయిల మధ్య సర్వ ఒక్కడే ఉన్న చిరంజీవి పాటకు అదిరిపోయే డాన్స్ వేయడం జరిగిందట. ఈ సంగీత్ వేడుకలకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా హాజరయ్యారు. అక్కడ అందరితో మాట్లాడుతూ రామ్ చరణ్ తెగ సందడి చేయడం జరిగింది చరణ్ తో పాటు ఇతర సెలబ్రిటీలు కూడా ఈ వేడుకకు వెళ్ళినట్లు తెలుస్తోంది. ఈ వేడుకలలో శర్వానంద్ తెలుపు రంగు పూర్త ధరించి కనిపిస్తున్నారు.
శర్వానంద్ కు సంబంధించి ఈ వీడియో మాత్రం తెగ వైరల్ గా మారుతుంది కుటుంబ సభ్యులు అంతా కలిసి ఒక్కసారిగా తనని స్విమ్మింగ్ పూల్ లో తోసేశారు.. వీరి వివాహ వేడుక రెండు రోజులపాటు జరగబోతోంది వీరి పెళ్లికి పలువురు సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది గత కొద్దిరోజుల క్రితం శర్వానంద్ ,రక్షిత రెడ్డి ఎంగేజ్మెంట్ చాలా ఘనంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది మధుసూదన రెడ్డి శర్వానంద్ మామగారు.. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.