తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి నటుడు గా గుర్తింపు తెచ్చుకొని ఇప్పటికే ఎన్నో సినిమా లలో తన అద్భుతమైన నటన తో ప్రేక్షకులను అలరించిన ప్రియదర్శి తాజాగా బలగం అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా నటించగా ... కమెడియన్ వేణు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.

మూవీ కొన్ని రోజుల క్రితమే ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన పాజిటివ్ టాక్ ను తెచ్చుకొని భారీ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ లో రన్ ను కొనసాగిస్తున్న సమయం లోనే ఈ మూవీ ని ఈ చిత్ర బృందం "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి తీసుకువచ్చింది.

మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో డిజిటల్ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా కొన్ని రోజుల నుండి ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియో   "ఓ టి టి" ప్లాట్ ఫామ్ వారు తమ  "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే థియేటర్ లలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో కూడా ప్రేక్షకుల నుండి అదే రేంజ్ లో రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఇండియా లోని ప్రైమ్ వీడియో చార్ట్‌లలో రెండవ స్థానంలో ట్రెండింగ్‌లో ఉంది. ఇలా థియేటర్ లలో అద్భుతమైన విజయం అందుకున్న ఈ సినిమా ప్రస్తుతం "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో కూడా ఫుల్ జోష్ లో దోచుకుపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: