ఈఏడాదికి ముంగిపు పలుకుతూ క్రిస్మస్ టార్గెట్ చేసుకుని జరగ బోతున్న  అతిపెద్ద బాక్సాఫీస్ క్లాష్. ‘సలార్’ వర్సెస్ ‘డంకీ’ లో ఎవరు విజేత అన్నవిషయమై ఇండస్ట్రి వర్గాలు చాలా ఆశక్తిగా ఎదురు చూస్తున్నాయి.   అయితే ఈరెండు సినిమాలు విడుదల కాకుండానే వార్ వన్ సైడ్   అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని ఇండస్ట్రి వర్గాలు అంటున్నాయి.  


దీనికికారణం ‘సలార్’ మూవీకి అడ్వాన్స్ బుకింగ్ లో ఓవర్సీస్ లో వస్తున్న స్పందన. ఈసినిమాకు సంబంధించి ఆస్ట్రేలియాలో 119 షోల నుంచి ఇప్పటిదాక వసూలైన మొత్తం డాలర్లలో ఇప్పటివరకు  69 వేలు కాగా ‘డంకీ’ కేవలం 57 షోల నుంచి 6 వేలు దాటడానికి కష్టపడింది అన్న  వార్తలు వస్తూ ఉండటంతో ప్రభాస్ అభిమానులు ప్రభాస్ ఆధిపత్యానికి  షారూఖ్ కన్ఫ్యూజ్ అవుతున్నాడు అంటూ సోషల్ మీడియాలో  కామెంట్స్ పెడుతూ హడావిడి చేస్తున్నారు.  


ఇక అమెరికా విషయానికి వస్తే 1000 పైగా షోలతో ‘సలార్’ 6 మిలియన్ డాలర్లు దాటేందుకు అడుగులు వేస్తుంటే ‘డంకీ’ అమెరికాలో 350 పైగా షోలతో కేవలం 50 వేల డాలర్లతో ఎదురీదుతోంది అంటూ వార్తలు    వస్తున్నాయి. జవాన్’ ‘పఠాన్’ బ్లాక్ బస్టర్ సక్సస్ లతో జోష్ పై ఉన్న   షారూఖ్ తాను ప్రమోట్ చేయకపోయినా ‘డంకీ’ కి విపరీత క్రేజ్ ఏర్పడి  కలెక్షన్స్ విషయంలో ఎదురు ఉందని అంచనాలు పెట్టుకున్నాడు.  


విపరీతమైన క్రేజ్ తెచ్చి పెడతాయని ఊహించిన షారూఖ్ ఖాన్ కు ‘డంకీ’ అడ్వాన్స్ బుకింగ్స్ ఆందోళన కలిగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికితోడు ఈమూవీ ట్రైలర్ కు వచ్చిన నెగటివ్ స్పందన షారూఖ్ ను మరింత ఖంగారు పెడుతున్నట్లు టాక్. ఈ పరిస్థితులు ఇలా ఉండగా ‘సలార్’ మూవీ ట్రైలర్ కు కూడ స్పందన అంతంత మాత్రంగానే ఉన్న నేపధ్యంలో ఈ రెండు సినిమాల మధ్య పోటీ మరింత ఆశక్తిదాయకంగా మారి షారూఖ్ ఖాన్ ప్రభాస్వార్ లో విజేత ఎవరు అన్న ఆశక్తి రోజురోజుకు పెరిగిపోతోంది..



మరింత సమాచారం తెలుసుకోండి: