
ఇకపోతే పునర్నవి మొదట రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమాలో హీరోయిన్ ఆవికాగోర్ స్నేహితురాలిగా కనిపించింది. ఆ తర్వాత హీరో శర్వానంద్ నటించిన మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమాలో కూతురు పాత్రలో నటించింది. అలాగే ఈ సినిమా సూపర్ హిట్ గ్యారెంటీ, పిట్టగోడ, ఒక చిన్న విరామం, సైకిల్, మనసుకు నచ్చింది వంటి సినిమాలలో నటించింది. ఇలా సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. కానీ మంచి హిట్ మాత్రం పడలేదు. దీంతో ఇండస్ట్రీలో అంతగా అవకాశాలు దక్కించుకోలేకపోయింది. పునర్నవి వెబ్ సిరీస్ లలో కూడా నటించింది.
ఈమె సోషల్ మీడియాలో నిత్యం చాలా యాక్టివ్ గా ఉంటుంది. అయితే తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియా వేదికగా తన ఫొటోస్ ని షేర్ చేసింది. ఆ ఫోటోలో పునర్నవి బ్లాక్ కలర్ అవుట్ ఫిట్ లో కనిపించింది. ఆమె హిమాచల్ ప్రదేశ్ కి విహారయాత్రకు వెళ్ళింది. ఈ నేపథ్యంలో ఆమె ధరమ్ కోట్ లో తీసుకున్న ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలో పునర్నవి చాలా బొద్దుగా కనిపించింది.. ఎంతో మారిపోయినట్లుగా అనిపించింది. అలాగే యోగా ఆసనాలు చేసిన వీడియోలను సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫొటోస్ చూసిన నెటిజన్స్ ఏంటి ఈమె పునర్నవినా అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.