- ( హైద‌రాబాద్‌ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ యంగ్ టైగర్ .. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కలయికలో రాబోతున్న సినిమా డ్రాగన్. ఈ సినిమాపై రోజుకొక రూమర్ వినిపిస్తోంది. లేటెస్ట్ బజ్ ప్ర‌కారం ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ అదిరిపోతుందట. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యం లో ఈ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందని ... పైగా ఈ సినిమాకే కాకుండా ఎన్టీఆర్ సినీ కెరీర్ లో నే ఈ సీక్వెన్స్ చాలా హైలెట్గా నిలిచిపోతుందని తెలుస్తోంది. ఈ వార్త నిజమైతే ఎన్టీఆర్ అభిమానులకు ఈ సినిమా ఎప్పటికీ స్పెషల్ గా నిలిచిపోతుంది అనటంలో సందేహం లేదు. ఈ సీన్స్‌తో థియేటర్ల‌లో సినిమా చూస్తోన్న సినీ ల‌వ‌ర్స్ కు పూన‌కాలు లోడ్ అయిపోతాయ‌ట‌.


మరోవైపు డ్రాగన్ సినిమా ఎన్టీఆర్ కెరియర్ లోనే అత్యుత్తమ సినిమాలలో ఒకటిగా చేయాలని దర్శకుడు ప్రశాంత్ నీల్‌ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకే ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ప్రశాంత్ నీల్‌ చాలా టైం తీసుకున్నాడు. ప్రీ ప్రొడక్షన్ కోసం దాదాపు ఏడాది అన్న టైం పట్టింది. ఇప్పటివరకు ప్రశాంత్ నీల్‌ తీసిన అన్ని సినిమాలలో కెల్లా ది బెస్ట్ సినిమా ఇదే అవుతుందని అంచనాలు ఉన్నాయి. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ - ఎన్టీఆర్ ఆర్ట్స్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా. రవి ప్రసూర్ సంగీతం అందిస్తున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: