
టాలీవుడ్ లో మంచు ఫ్యామిలీ వారసుడు మంచు మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన కన్నప్ప సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయింది. ఈ సినిమాలో ఇతర భాషలకు చెందిన ఎంతో మంది స్టార్ హీరోలు నటించారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ - కేరళ సూపర్ స్టార్ మోహన్ లాల్ - టాలీవుడ్ స్టార్ ప్రభాస్ లు కీలక పాత్రలలో నటించారు. అలాగే హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా కీలకపాత్రలో నటించారు. ఇక కన్నప్పలో తిన్నడు పాత్రలో మంచు విష్ణు నటించారు. ఈ సినిమాకు మంచు విష్ణు అన్ని వ్యవహరించారు. బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రమోషన్లు మంచి విష్ణు ఒంటిచేత్తో నిర్వహించారని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ సినిమాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఎప్పుడు చూపిస్తారు ? అన్న ప్రశ్నకు విష్ణు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.
కన్నప్ప సినిమా ఈ రోజు విడుదల అవుతోందని... పవన్ కళ్యాణ్ సమయం తీసుకుని వ్యక్తిగతంగా కలిసి ఆయనకు సినిమా చూపిస్తా అని తెలిపారు. మనకు తెలిసిన పవన్ కళ్యాణ్ వేరు ... ఈరోజు ఆయనపై రాష్ట్ర మొత్తం బాధ్యత ఉంది తప్పకుండా ఆయన సమయం తీసుకుని సినిమా చూపించాలన్నారు. నటుడుగా ఆయన నాకు సీనియర్ ఆయన ప్రశంసల కోసం తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని విష్ణు చెప్పారు. ఇక ఈ సినిమాలో తన నలుగురు పిల్లలు నటించారని ... నా సతీమణిని కూడా యాక్ట్ చేయమని అడిగానని విష్ణు తెలిపారు. ఇక ఈ సినిమా విషయంలో నా తండ్రికి కృతజ్ఞతలు చెప్పాలని.. ఆయన ఇచ్చిన ధైర్యంతోనే తన ముందడుగు వేసి తెలిపారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు