
పైగా ఈరోజు నుంచి దేశంలో అన్ లాక్ 4.0 ప్రక్రియ మొదలైంది. అంతరాష్ట్రల మధ్య రాకపోకలపై అమలులో ఉన్న ఆంక్షలు ఎత్తివేశారు. దీంతో రాష్ట్రాల మద్య ప్రజలు గతంలో మాదిరిగానే తిరగొచ్చు. ఎలాంటి అడ్డంకు లేవు. ఈ పాస్ లు అవసరం లేదు. పైగా సెప్టెంబర్ 21 నుంచి ఓపెన్ ఎయిర్ థియేటర్లు, విని సభలు, సమావేశాలకు అనుమతి ఉన్నది. సెప్టెంబర్ 7 నుంచి దశలవారీగా మెట్రో రైళ్లు పరుగులు తీయబోతున్నాయి.
అంటే గతంలో మాదిరిగానే ఇప్పుడు ప్రజలు స్వేచ్చగా తిరిగేందుకు అవకాశం కలిగింది. మాస్కులు వాడినప్పటికి ఎంతవరకు ఉపయోగం ఉంటుంది. రైళ్లు ప్రతి స్టేషన్లో శానిటైజ్ చేయడం సాధ్యం అవుతుందా.. 100 మందితో నిర్వహించే సభలు, సమావేశాల్లో కరోనా విస్తరించకుండా ఆపడం సాధ్యం అవుతుందా.. ముమ్మాటికి ఆపలేరు. వ్యాక్సిన్ వచ్చేవరకు సహజీవనం చేయక తప్పదు. వ్యాక్సిన్ వచ్చిన తరువాత కూడా కొంతకాలం పాటు కరోనాతో కలిసి జీవించక తప్పని పరిస్థితి. కరోనా నుంచి ఇండియా పూర్తిగా కొలుకొని సాధారణ పరిస్థితులు నెలకొనాలి అంటే కనీసం నాలుగేళ్లయిన పడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. కరొనాకు వ్యాక్సిన్ వచ్చి, దానిని ప్రతి ఒక్కరికీ అందించి వైరస్ మహమ్మరిని తరిమివేసినపుడే ప్రజాజీవనం సక్రమంగా సాగుతుంది. అప్పటి వరకు దినదినం నూరేళ్ళ గండం మాదిరిగా జీవించాల్సిందే.