
అయితే కొన్ని దేశాలకు వ్యాక్సిన్ ని అభివృద్ధి చేసిన దేశాలు లక్షల డోస్ లు వ్యాక్సిన్లను బహుమతులుగా ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. కానీ టర్కీ,సిరియా లాంటి దేశాల తీరుతో ఆ దేశాలు వ్యాక్సిన్ పొందలేకపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు టర్కీ సరైన స్థాయిలో వ్యాక్సిన్ డోసులు పొందక పోవడంతో చివరికి అక్కడ కరోనా వైరస్ విజృంభించి ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అదే సమయంలో అక్కడి ప్రజలందరిలో ప్రభుత్వ తీరుపై వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక టర్కీ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం కాస్త ప్రస్తుతం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
వ్యాక్సిన్ ఇచ్చినందుకు బదులుగా తమ దేశంలో కొంత మంది ప్రజలను అప్పగించేందుకు సిద్ధమయింది టర్కీ ప్రభుత్వం. చైనా దురాగతాలను తట్టుకోలేక ఇక చైనా నుంచి పారిపోయి వచ్చిన ఎంతో మంది వీగర్ ముస్లింలు టర్కీలో తలదాచుకున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ఈ వీగర్ ముస్లింల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న తర్వాతే ప్రభుత్వం చైనా నుంచి వ్యాక్సిన్లు దిగుమతి చేసుకుని దానికి బదులుగా వీగర్ ముస్లింలను చైనాకు అప్పగించేందుకు సిద్ధమైంది. చైనా ఇప్పటికే పది లక్షల డోస్ లను టర్కీ కి ఇస్తామని చెప్పినప్పటికీ ఇప్పటివరకు ఇవ్వలేదు. ఈ క్రమంలోనే వీగర్ ముస్లింలను అప్పగించిన తర్వాతనే వ్యాక్సిన్లు టర్కీలో కి దిగుమతి అయ్యే అవకాశం ఉందని ప్రస్తుతం అక్కడి వీగర్ ముస్లింలు అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు.