
అయితే ఇటీవల కాలంలో అమాయకులనే కాదు అటు సినీ సెలబ్రిటీలు ప్రజాప్రతినిధులు అధికారులను కూడా వదలడం లేదు. సైబర్ నేరగాళ్లు తమ పేరు పై సోషల్ మీడియా ఖాతాలను క్రియేట్ చేయడం వాటి ద్వారా మెసేజ్లు కాల్ చేసి డబ్బులు గుంజడం లాంటి చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి ఎన్నో ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు ఏకంగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి విషయంలో కూడా ఇదే జరిగింది. టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేరు మీద ఫేక్ ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేశారు కేటుగాళ్లు.
అంతేకాదండోయ్ ఈ ఫేస్బుక్ అకౌంట్ కి డిపి గా ఒక అమ్మాయి ఫోటోలు పెట్టడం గమనార్హం. ఇక ఈ నకిలీ ఫేస్బుక్ అకౌంట్ విషయం అటు తిరిగి ఇటు తిరిగి చివరికి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వరకు వెళ్ళింది. దీంతో జగ్గారెడ్డి వెంటనే అప్రమత్తమయ్యారు తన అనుచరుల అందర్నీ కూడా అప్రమత్తం చేశారు. నా పేరు మీద ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేశారని తెలిపారు. ఇక డీపీ గా ఒక అమ్మాయి ఫోటో పెట్టి నా పేరును డ్యామేజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు జగన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక ఈ విషయంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆయన. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..