ఇక రీసెంట్ గా అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో బీజేపీ ఫుల్ జోష్ గా ఉంది. పంజాబ్లో ఓటమి ఎదురైనా కాని మిగతా నాలుగు రాష్ట్రాల్లో మాత్రం అధికారాన్ని నిలబెట్టుకోవడం ఆ పార్టీకి ఆనందాన్నిస్తోంది.ముఖ్యంగా దేశ రాజకీయాల్లో ముఖ్యమైన యూపీలో వరుసగా రెండో సారి అధికారంలోకి వచ్చి రికార్డు క్రియేట్ చేసింది. ఇదే జోరులో తరువాతి టార్గెట్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇక జాతీయ రాజకీయాల్లో తమకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్న వాళ్లను దెబ్బకొట్టేలా రాష్ట్రపతి ఎన్నికపై దృష్టి పెట్టినట్లు సమాచారం తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ని కట్టడి చేసేందుకు.. ఇంకా దక్షిణాదిలో పట్టు సాధించేందుకు తెలుగు వ్యక్తినే రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేస్తారని సమాచారం తెలుస్తుంది.ఇక యూపీలో వచ్చిన సీట్లు రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా చేంజ్ అవుతాయి. ప్రస్తుత రాష్ట్రపతి పదవీ కాలం ఈ ఏడాది జులై నెలతో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో తర్వాత అభ్యర్థి ఎవరనే విషయంపై బీజేపీ పార్టీ దృష్టి సారించింది.


ఇక 776 మంది పార్లమెంట్ సభ్యులు వివిధ రాష్ట్రాల్లోని 4120 మంది శాసనసభ్యులతో ఏర్పాటు చేసిన ఎలక్టోరల్ కాలేజీ ద్వారా రాష్ట్రపతిని సెలెక్ట్ చేసుకుంటారు. వీళ్ల ఓట్ల విలువ ఆధారంగా ఎలక్షన్ ఉంటుంది. ప్రస్తుతం బీజేపీ పార్టీకి సగం కంటే ఎక్కువ బలం ఉంది. కాబట్టి మరోసారి బీజేపీ అభ్యర్థి రాష్ట్రపతి అయ్యే ఛాన్స్ ఉంది.అందుకే ఈ నేపథ్యంలో ఉప రాష్ట్రపతిగా ఉన్న తెలుగు వ్యక్తి వెంకయ్యానాయుడిని రాష్ట్రపతి చేయాలని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం తెలుస్తుంది. సౌత్ లో అందులోనూ తెలుగు రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ పెట్టిన బీజేపీ ఏపీకి చెందిన వెంకయ్య నాయుడిని రాష్ట్రపతి చేయాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక అందుకోసం వైసీపీతో పాటు బిజూ జనతాదళ్తోనూ బీజేపీ చర్చలు చేస్తున్నట్లుగా సమాచారం తెలుస్తుంది. దీంతో ఇక ఏకగ్రీవంగానే అభ్యర్థిని ఎన్నుకోవాలనే దిశగా కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

BJP