రష్యా ఉక్రెయిన్‌ పై యుద్ధం కొనసాగిస్తూనే ఉంది. అయితే.. రష్యా సైనికులు ఉక్రెయిన్ మహిళలపై అత్యాచారం చేస్తున్నారన్న ఆరోపణలు కూడా బాగా వినిపిస్తున్నాయి. అందుకే ఇప్పుడు ఉక్రెయిన్ మహిళలు రష్యా సైనికులు తమను రేప్ చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. వాటిలో ఒక జాగ్రత్త ఏంటంటే.. జుట్టు కత్తిరించుకోవడం.. యుద్ధం జరుగుతున్న ప్రాంతాల్లో చాలా మంది ఉక్రెయిన్ మహిళలు తమ జుట్టు కత్తిరించుకుంటున్నారట. జట్టు పెద్దగా లేకపోతే.. తాము అందంగా కనిపించమని.. అందువల్ల రష్యా సైనికులకు తాము దొరికినా రేప్‌ చేసే అవకాశం తక్కువ అని వారు భావిస్తున్నారట. పాపం.. ఉక్రెయిన్ మహిళల దుస్థితి చూస్తే ఎవరికైనా జాలి కలగకమానదు.


అయితే..  రష్యా సైనికుల తీరుపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. ఎంతగా యుద్ధం చేస్తున్నా ప్రతి దేశం కొన్ని యుద్ధ నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఇంత కంటే పాత రోజుల్లోనూ ఆ యుద్ధ నియమాలు పాటించే సంప్రదాయం ఉండేది. అలాంటి యుద్ధ సాంప్రదాయాల్లో మహిళలు, చిన్న పిల్లల జోలికి రాకపోవడం ఒకటి. యుద్ధంలో పాల్గొనే దేశాలు కూడా శత్రు సైన్యాల నుంచి ముప్పు రాకుండా తగిన కూడా జాగ్రత్తలు తీసుకునేవి.


ఇప్పుడు ఉక్రెయిన్ పై విరుచుకుపడుతున్న రష్యా  సైన్యం మాత్రం ఇలాంటి యుద్ధ నియమాలను ఏమాత్రం  సైతం పట్టించుకోవట్లేదని ఉక్రెయిన్ బాధితులు చెబుతున్నారు. తమ మహిళలపై రష్యా సైనికులు అత్యాచారాలకు, దాడులకు పాల్పడుతున్నారని ఉక్రెయిన్ దేశం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇటీవల బ్రోవరీలో ఓ ఉక్రెయిన్ మహిళపై..  ఆమె కన్నబిడ్డ ఎదుటే రష్యా సైనికుడు అత్యాచారానికి పాల్పడ్డాడన్న వార్త.. సంచలనం సృష్టించింది. మీడియాలో చర్చనీయాంశం అయ్యింది.


బ్రోవరీ ఘటన గురించి ఓ ఉక్రెయిన్ మహిళా ఎంపీ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు కలకలం రేపాయి. ఉక్రెయిన్‌లో ఇలాంటి దారుణాలు ఎన్నో ఘటనలు జరుగుతున్నాయని ఆ మహిళా ఎంపీ వాపోయారు. అందుకే ఇప్పుడు ఉక్రెయిన్ మహిళలు తమంతట తామే రక్షించుకునేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: