తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం మొత్తం ఈ ఏడాది కుంభవృష్టి కురిపించిన నైరుతి రుతుపనాలు ఎట్టకేలకు వెనక్కి మళ్లాయి. మరో 24 గంటల్లో రుతుపవనాల ఉపసంహరణకు మంచి వాతావరణం ఏర్పడిందని తెలిపింది వాతావరణశాఖ.

రాగల 24 గంటల్లో కొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి‌. రాగల 2 రోజులలో దేశం మొత్తం నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు అనుకూల పరిస్థితులున్నాయి. ఈ ఏడాది చాలా ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు వెనక్కి మళ్లాయి. గత 11 సంవత్సరాల్లో నైరుతీ రుతుపవనాలు 2018లో బాగా ఆలస్యంగా సెప్టెంబర్ 29న నిష్క్రమణను ప్రారంభించాయి‌.

వాస్తవానికి ఈ ఏడాదిలో కూడా అదే సమయంలో నైరుతీ రుతుపవనాలు వెనక్కి మళ్లాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ రోజుతో వర్షాకాలం ముగిసిపోయినట్టు కూడా గుర్తించారు. అయితే బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనాల కారణంగా వస్తున్న తేమగాలులు.. మధ్యప్రదేశ్ పై ఉన్న రుతుపవనాలకు అడ్డుగా నిలిచి, వాటిని ఎటూ కదలకుండా ఆపివేశాయి‌. దాంతో వరుసగా కురుసిన వర్షాలతో తెలుగురాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి.

మరోవైపు.. నైరుతి బంగాళాఖాతంలో 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. తూర్పు మధ్య బంగాళాఖాతం, ఉత్తర అండమాన్ సముద్రం ప్రాంతాలలో అక్టోబర్ 29వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం కూడా ఉందని తెలిపింది వాతావరణశాఖ. దీని ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలలో ఈ రోజు, రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక తెలంగాణా విషయానికి వస్తే రాగల మూడు రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

ఇన్నాళ్లూ తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోం సృష్టించిన వర్షాలు నెమ్మదించేశాయి. పైగా 24గంటల్లో నైరుతి రుతుపవనాలు కూడా ఉపసంహరణ కానున్నాయి. ఉపసంహరణకు అనుకూల వాతావరణమే ఉన్నట్టు వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించేసింది. మరోవైపు నైరుతీ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో ఆంధ్రప్రదేశ్ లో మాత్రం రెండురోజుల పాటు తేలిక పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: