ఓట్ల పండుగ రానే వచ్చింది. హైదరాబాద్ లో ఉండే వేలాది మంది ఇప్పుడు ఏపీ బాట పట్టారు. అది కూడా ఓటేయ్యడం కోసం. వివిధ రాజకీయ పార్టీలు, నేతలు పోటాపోటీగా ఏర్పాటు చేసిన బస్సుల్లోనే కాదు.. సొంత వాహనాలు, రైళ్లు, ప్రైవేట్ బస్సులు ఇలా చెప్పుకుంటూ పోతే ఓటు వేయడానికి ఊరికి వెళ్లే  ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా వెళ్తున్న వారి సంఖ్య వేలను దాటి లక్షలుగా మారడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


ఒక్క హైదరాబాద్ నుంచే కాదు. బెంగళూరు, చెన్నై మొదలు కొని దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారితో పాటు విదేశాల్లో ఉన్న వారు కూడా వందలాది మంది ఫ్లైట్ ఛార్జీలు పెట్టుకొని మరీ రావడం ప్రస్తుతం ఏపీలో కనిపిస్తూ ఉంది. మరి ఇన్ని వ్యయ ప్రయాసలు కూడి వస్తున్న వారు ఎవరికీ ఓటు వేయనున్నారు అనేది ఇప్పుడు ప్రశ్న.  అదే రాజకీయ పార్టీల మెదళ్లను తొలిచేస్తోంది.


బయట నుంచి ఊళ్లకు వస్తున్న ఓట్లు మొత్తం తమవే అంటూ కూటమి వినిపిస్తున్న వాదనలో ఎలాంటి పస లేదంటున్నారు విశ్లేషకులు. బయట ప్రాంతాల్లో ఉన్న వారు కాబట్టి వారంతా కూటమికే ఎందుకు ఓటు వేస్తారు అనేది వారి ప్రశ్న. లాజిక్ లు వెతికితే.. వారు ఏపీలో ఉండటం లేదు. ఇక్కడి స్థానిక పరిస్థితులు వారికి కనిపించవు. కానీ వీళ్ల తల్లిదండ్రులు ఫోన్ చేసి చెబితే తెలుసుకుంటారు.


ప్రస్తుతం ఏపీలో ఏ గ్రామానికి వెళ్లినా ఓ వార్డు సచివాలయం, ఆర్బీకే సెంటర్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఆసుపత్రులు దర్శనమిస్తాయి. పైగా ఇన్ని రోజులు తల్లి దండ్రుల వద్ద వీరంతా లేకపోయినా ఇంటికి వచ్చి మరీ పింఛన్లు పంపిణీ చేసే వాలంటీర్ వ్యవస్థ దగ్గర నుంచి  ఏ చిన్న ధ్రువపత్రం కావాలన్నా.. ప్రభుత్వ కార్యాలయాల దగ్గరకి వెళ్లాల్సిన పనిలేకుండా పాలనను ప్రజల వద్దకు సీఎం జగన్ తీసుకువచ్చారు అనేది అందరూ ఒప్పుకోవాల్సిన నిజం. అందువల్ల ఏపీకి వచ్చే వారంతా తమ ఊరి బాగు కోసం మరోసారి జగన్ నే సీఎం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: