మూడేళ్ల క్రితం రియో ఒలింపిక్ క్రీడా వేదికపై వెండి వెలుగులు విరబూయించిన సింధు తాజాగా భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ప్రకాశ్ పదుకొనే, గోపీచంద్, సైనా నెహ్వాల్ లాంటి ప్లేయర్ లు చరిత్ర సృష్టించారు. కానీ ఎవరూ ప్రపంచ ఛాంపియన్ షిప్ దగ్గరకు వెళ్లలేకపోయారు. ఒక మెయిల్ ప్లేయర్ కూడా వరల్డ్ చాంపియన్ కాలేక పోయారు. కానీ ఆ రికార్డును సింధూనే కొట్టేసింది. ఆమె భారతదేశ చరిత్రలోనే బాడ్మింటన్ లో ప్రపంచ విజేతగా నిలిచిన మొదటి ప్లేయర్ గా రికార్డు సృష్టించారు. కఠోర శ్రమ అంకితభావానికి ప్రతీక సింధు. సింధూకు ఈ విజయం సునాయాసంగా రాలేదు. అవకాశాన్ని ఆయుధంగా మలుచుకుంది. కొరియా కోటలను బద్దలు కొట్టింది. చైనీస్ ప్లేయర్ లను మట్టికరిపించింది. ఆత్మ విశ్వాసాన్ని అలంబనగా చేసుకుంది.


తెలుగమ్మాయి పూసర్ల వెంకట సింధు బాడ్మింటన్ చరిత్ర లిఖించింది. ఎత్తిపట్టిన రాకెట్ తో ఎదురెళ్లి ప్రతీకారం తీర్చుకుంది. బరిలోకి దిగిన ప్రతిసారీ ఏదో అడ్డంకితో దూరమైపోయిన టైటిల్ ను రెండు చేతులతో ఒడిసిపట్టుకుంటూ భారత సింధూరంగా మారింది నిలిచింది. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో పతకాలు కొల్లగొట్టిన పీవీ సింధు, సాయి ప్రణీత్ లకు భారత బ్యాడ్మింటన్ సమాఖ్య నజరానా ప్రకటించింది. స్వర్ణంతో చరిత్ర సృష్టించిన సింధుకు ఏకంగా ఇరవై లక్షల రివార్డును అందజేయనున్నట్టు వెల్లడించింది. కాంస్యంతో ముప్పయి ఆరేళ్ల తర్వాత పురుషుల సింగిల్స్ లో భారత్ కు తొలి పతకం అందించిన సాయి ప్రణీత్ కు ఐదు లక్షలు అందజేయనున్నట్టు బాయ్ ట్వీట్ చేసింది. కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప సింధుకు ఐదు లక్షల రివార్డు ప్రకటించారు.


ప్రపంచ చాంపియన్ షిప్ లో స్వర్ణ కాంతులు వెదజల్లింది. ఈ ఘనత సాధించిన తొలి భారత షట్లర్ గా చరిత్ర సృష్టించింది. ఈ సందర్భంగా తన విజయాన్ని అమ్మ విజయకి అంకితం చేసింది. కూతురి గెలుపు కోసం ఉద్యోగాన్ని సైతం వదులుకున్న ఆ తల్లి ప్రోత్సహిస్తే ప్రతి ఆడపిల్ల తన కూతురిలా శక్తికి ప్రతిరూపం అని చెబుతున్నారు. తెలుగు తేజం పీవీ సింధు చరిత్ర సృష్టించింది. అద్భుతమైన ఆటతీరుతో దుమ్ము రేపుతున్న సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది.

సెమీఫైనల్ లో ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్ యూఫీని మట్టికరిపించిన సింధు ఫైనల్ లో ప్రపంచ నెంబర్ ఫోర్ నోజోమీ ఒకుహారా పై వరుస సెట్ లలో విజయం సాధించి ప్రపంచ ఛాంపియన్ షిప్ ఉమెన్స్ సింగిల్స్ విజేతగా నిలిచింది.సింధు జూలై ఐదు పంతొమ్మిది వందల తొంభై ఐదు న పీ వీ రమణ, పి విజయ దంపతులకు హైదరాబాద్ లో జన్మించింది. ఆ దంపతులిద్దరూ వాలీబాల్ క్రీడాకారుడలు. రమణ పూర్వికులు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వారు. ఆయన ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ లో జన్మించారు. ఉద్యోగరీత్యా గుంటూరుకు తరలివెళ్లారు. రమణ తన వాలీబాల్ కెరియర్ కోసం రైల్వేలో ఉద్యోగం రావడంతో హైదరాబాద్ లో స్థిరపడ్డారు. తల్లి విజయ స్వస్థలం విజయవాడ. రెండు వేలులో రమణకు అర్జున పురస్కారం లభించింది. ఆమె తల్లితండ్రులిద్దరూ వాలీబాల్ ఆటగాళ్లైన సింధు మాత్రం పుల్లెల గోపీచంద్ స్ఫూర్తితో బాడ్మింటన్ ఎంచుకుంది. అప్పటికీ గోపీచంద్ ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ పోటీలలో గెలిచి వార్తల్లో వ్యక్తిగా ఉన్నాడు.


సింధు ఎనిమిదేళ్ల వయసు నుంచే బ్యాడ్మింటన్ ఆడటం ప్రారంభించింది. సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల పన్నెండున అంతర్జాతీయ బాడ్మింటన్ సమాఖ్య ప్రకటించిన ర్యాంకింగ్స్ లో టాప్ ట్వంటీ జాబితాలో చోటు దక్కించుకోవడం ద్వారా సింధుకు మొదటిసారిగా అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. రెండు వేల పదమూడులో చైనాలో అంతర్జాతీయ బాడ్మింటన్ సమాఖ్య నిర్వహించిన ప్రపంచ చాంపియన్ షిప్ లో పతకం సాధించి అలా గెలిచిన మొట్టమొదటి భారతీయురాలిగా రికార్డు సాధించింది. సింధుకు భారత ప్రభుత్వం పద్మశ్రీ ని ప్రదానం చేసింది. రియో ఒలింపిక్స్ లో జరిగిన సెమీ ఫైనల్స్ లో జపాన్ కు చెందిన నొజోమీ ఒకుహరాను ఓడించడం ద్వారా ఒలింపిక్స్ లో బాడ్మింటన్ విభాగంలో ఫైనల్ చేరిన తొలి భారతీయ మహిళగా నిలిచింది.


తరువాత జరిగిన ఫైనల్ లో రజత పతకం సాధించి ఒలింపిక్స్ లో రజతం సాధించిన మొట్టమొదటి భారతీయ క్రీడాకారిణిగా అత్యంత పిన్న వయస్కురాలైన భారతీయురాలిగా నిలిచింది. రెండు వేల పదమూడులో తొలిసారి ప్రపంచ సీనియర్ చాంపియన్ షిప్ లో ఆడిన తెలుగమ్మాయి ప్రపంచ పన్నెండవ ర్యాంకర్ పీవీ సింధు సంచలనం నమోదు చేసింది. తనకంటే మెరుగైన ర్యాంక్ లో ఉన్న చైనా క్రీడాకారిణిని ఓడించి క్వార్టర్ ఫైనల్ లోకి దూసుకెళ్లింది. ఆగస్టు ఎనిమిది రెండు వేల పదమూడున జరిగిన మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్ లో రెండో సీడ్ యిహాన్ వాంగ్ ను సింధు ఓడించింది. యాభై ఐదు నిమిషాల్లోనే ప్రత్యర్థిని మట్టికరిపించింది. కవోరీ ఇమాబేపుతో రెండు వేల పదమూడులో జరిగిన రెండో రౌండ్ లో సింధు విజయం సాధించింది. డెబ్బై యొక్క నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్ లో సింధుకు గట్టి పోటీనే లభించింది.


నిర్ణయాక మూడో గేమ్ లో సింధు ఒక దశలో వెనుకపడింది. ఈ దశలో ఒత్తిడికి లోను కాకుండా సంయమనంతో ఆడిన సింధు వరుసగా ఆధిక్యం లోకొచ్చింది. అనంతరం ఆ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ విజయాన్ని ఖాయం చేసుకుంది. రాజీవ్ ఖేల్ రత్న అవార్డు జాతీయ అత్యుత్తమ క్రీడా అవార్డు అర్జున అవార్డు అందుకుంది. సింధుపై బయోపిక్ తీయాలని ఉందని లక్షలాది మంది భారతీయ మహిళలకు ప్రేరణగా నిలిచిన అమ్మాయి సింధు అని చెప్పారు బాలీవుడ్ నటుడు సోనూసూద్. సింధు జీవిత కథ ఆధారంగా సినిమా తీసేందుకు ముందుకొచ్చారు. సింధుపై బయోపిక్ తీయాలని ఉందని లక్షలాది మంది భారతీయ మహిళలకు ప్రేరణగా నిలిచిన అమ్మాయి సింధూ అని చెప్పారు.


సింధు హార్డ్ వర్క్ ద్వారా అద్భుత ఘనతను సాధించిందని, షట్లర్ సింధు ప్రగతిని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అంశమని ఈ సందర్భంగా సోనూసూద్ అన్నారు. సింధు ఎనిమిదేళ్ల ప్రాయం నుంచే బ్యాట్ మింటన్ ఆడుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని ఆమె పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందారు. ప్రస్తుతం సింధు ఏపీ డిప్యూటీ కలెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఏపీ డిప్యూటీ కలెక్టర్ గా పీవీ సింధు అయిన వరల్డ్ ర్యాంకింగ్స్ లో ఐదో స్థానంలో ఉన్న బాడ్మింటన్ స్టార్ రియో ఒలింపిక్స్ లో రజతంతో మెరిసిన తెలుగు తేజం పీవీ సింధుకు నాటి చంద్రబాబు ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్ పోస్టును ఆఫర్ చేసింది. దానికి అంగీకరించిన సింధు గ్రూప్ వన్ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తుంది. అయినా ఆటను వదిలిపెట్టకుండా ఆమె ప్రస్తుతం వరల్డ్ ర్యాంకింగ్స్ లో ఐదో స్థానంలో నిలిచి సింధు వరల్డ్ చాంపియన్ గా నిలిచింది. ఇలా మొదటి సారి ఈ టోర్నమెంట్ లో గోల్డ్ మెడల్ సాధించిన క్రీడాకారిణిగా సింధు చరిత్ర సృష్టించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: