తెలుగు తేజం పీవీ సింధు గురించి క్రీడా అభిమానులందరికీ కొత్తగా పరిచయం అక్కర్లేదు అని చెప్పాలి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల నుంచి క్రీడాకారిణిగా ఎదిగిన పీవీ సింధు అటు అంతర్జాతీయ వేదికలపై భారత జెండా రెపరెపలాడే విధంగా అద్భుతమైన విజయాలను సాధించింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎప్పుడూ తన ఆటతీరుతో ప్రత్యర్థులకు చమటలు పట్టిస్తూ ఉంటుంది పీవీ సింధు.


 ఇక అంతర్జాతీయ క్రీడలలో పీవీ సింధు బరిలోకి దిగింది అంటే చాలు ఏదో ఒక మెడల్ సాధించడం ఖాయం అన్న విధంగానే అంచనాలు ఉంటాయి. ఇక ఈ అంచనాలను నిలబెట్టుకుంటూ ఇప్పటివరకు పీవీ సింధు తన కెరీర్ లో ఎన్నో మెడల్స్ సాధించింది అని చెప్పాలి. ఇక 2019 వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలలో అయితే గోల్డ్ మెడల్స్ సాధించి తన చిరకాల వాంఛను నెరవేర్చుకుంది. ఈ క్రమంలోనే ఇక ప్రస్తుతం పీవీ సింధు ఎంతోమంది యువ ప్లేయర్లకు స్ఫూర్తిగా నిలుస్తుంది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే ఒక కార్యక్రమంలో పాల్గొన్న పీవీ సింధు తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది అని చెప్పాలి.



 వరల్డ్ ఛాంపియన్షిప్ గోల్డ్ మెడల్ కోసం దాదాపు 5 ఏళ్ల పాటు నిరీక్షణగా ఎదురు చూశాను అంటూ బ్యాట్మెంటన్ ప్లేయర్ పీవీ సింధు చెప్పకు వచ్చింది. ప్రో వాలీబాల్ లీగ్ ప్రారంభానికి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యింది పి.వి.సింధు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఒలంపిక్ మెడల్ తర్వాత అంతటి ఆనందాన్ని ఇచ్చింది వరల్డ్ ఛాంపియన్షిప్ బతకం మాత్రమే అంటూ చెప్పుకొచ్చింది  2013, 14 లలో వరల్డ్ ఛాంపియన్షిప్ లో బ్రాంజ్ మెడల్ ను సొంతం చేసుకుంది పీవీ సింధు  2017, 18 లలో సిల్వర్ మెడల్ దక్కించుకుంది అని చెప్పాలి. ఇక 2019లో మాత్రం ఎన్నో ఏళ్లుగా నిరీక్షణగా ఎదురు చూస్తున్న బంగారు పథకాన్ని ముద్దాడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: