
ఇక జూన్ 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఈ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చాలా రోజుల కిందటే ఇక డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ ఆడబోయే ఆటగాళ్ల వివరాలను ఇరుదేశాల క్రికెట్ బోర్డులు ప్రకటించాయి. అయితే ఇలా డబ్ల్యూటీసి ఫైనల్ కోసం ఎంపికైన ఆటగాళ్లు అందరూ కూడా ఇంగ్లాండ్ చేరుకుని అక్కడ ప్రాక్టీస్ లో మునిగి తేలుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో సాంప్రదాయమైన క్రికెట్ గా పిలుచుకునే టెస్ట్ ఫార్మాట్లో విశ్వ విజేతగా నిలవాలని రెండు జట్లు కూడా పట్టుదలతో ఉన్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ పై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు ఇస్తున్న రివ్యూ కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి అనడంలో సందేహం లేదు.
ఈ క్రమంలోనే ఈనెల 7వ తేదీ నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగబోయే డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ గురించి ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ నాథన్ లయన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ దృష్టి మొత్తం డబ్ల్యుటిసి ఫైనల్ మ్యాచ్ పైనే ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇదే నెలలో ఇంగ్లాండ్ తో ప్రారంభం కానున్న యాషెష్ సిరీస్ కంటే తమకు డబ్ల్యుటిసి ఫైనల్ మ్యాచ్ ఎంతో ముఖ్యం అంటూ తెలిపాడు. ఇలా డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ కోసమే తీవ్రంగా శ్రమిస్తున్నాము అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ ఫైనల్ మ్యాచ్లో తమ ప్రాణాలికలను పక్కాగా అమలు చేస్తామని తెలిపాడు. ఈ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా క్రికెట్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అంటూ కామెంట్ చేశాడు నాథన్ లియోన్.