మనిషి జీవితం ఎంతో విలువైనది. ఎందుకంటే ఈ భూమ్మీద ఎన్నో జీవులు ఉన్న మనిషి మాత్రం ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే మిగతా జీవుల్లా కాకుండా మనిషి పరిస్థితిలకు తగ్గట్లుగా ప్రవర్తించగలడు. విచక్షణ జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. అందుకే అన్ని జీవుల్లోకెల్లా మనిషి అనే జీవి ఎంతో ప్రత్యేకమ్ అని చెబుతూ ఉంటారు నిపుణులు. కానీ ఇటీవల కాలంలో మనుషుల్లో విచక్షణ జ్ఞానమే లేకుండా పోతుందా అంటే వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తూ ఉంటే అవును అని సమాధానం చెబుతున్నారు అందరూ.


 ఎందుకంటే దేవుడు ఇచ్చిన విలువైన ప్రాణానికి అసలు లెక్క చేయడం లేదు మనుషులు. చిన్న చిన్న కారణాలకే ఏకంగా ప్రాణాలను తీసుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. దీంతో నిండు నూరేళ్ల జీవితాన్ని మనుషులే చేజేతులారా ముగిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా అప్పుడప్పుడు ఎదుగుతున్న పిల్లల సైతం ఏకంగా ఆత్మహత్య అనే ఆలోచన చేస్తూ తల్లిదండ్రులకు కడుపుకోతను మిగులుస్తున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇలాంటి తరహా ఘటనలు రోజురోజుకు ఎక్కువగానే వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి. ఏకంగా టీచర్ తిట్టిందని..  తల్లితండ్రులు మందలించారని.. పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని ఇలా చిన్నచిన్న కారణాలకే బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.


 ఇక ఇటీవల మెదక్ జిల్లాలో కూడా ఇలాంటి విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. చేగుంట మండలం పెద్ద శివనూరు గ్రామానికి చెందిన వడియారం మానస అనే పదహారేళ్ల బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటర్ చదువుతున్న మానస గత నెల 28వ తేదీన తల్లిదండ్రులు మందలించడంతో మనస్థాపం చెందింది. ఈ క్రమంలోనే క్షణికావేషంలో పురుగుల మందు తాగింది. అయితే ఆసుపత్రికి తరలించగా చివరికి చికిత్స పొందుతూ ఇటీవలే మృతి చెందింది సదరు బాలిక. అయితే అల్లారు ముద్దుగా పెంచుకునే కూతురు విగత  జీవిగా మారడంతో తల్లిదండ్రులు అరణ్య రోదనగా  విలపించారు  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: