ఏపీ సీఎం జగన్ తో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సమావేశం అయ్యారు. అనేక ని అంశాలపైనా ముఖ్యమంత్రితో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి చర్చించారు. జిల్లాలో నేను ఎదుర్కొంటున్న ఇబ్బందుల పై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి సీఎం జగన్ కు వివరించారు. ప్రోటోకాల్ అనేది పెద్ద విషయం కానే కాదన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి.. దాని మీద ఫిర్యాదు చేయడానికి ఏం ఉంటుందని ప్రశ్నించారు.


అంతేకాదు.. కొత్తగా రీజినల్ కోఆర్డినేటర్ పదవి కూడా మా మధ్య చర్చ జరగలేదని.. గతంలోనే  ఆ పదవి వద్దని రాజీనామా చేశానని బాలినేని తెలిపారు. మంత్రి పదవినే వదులుకుని వచ్చి ప్రోటోకాల్ గురించి ఫీల్ అయ్యేది ఏముంటుందన్న బాలినేని.. కావాలనే పార్టీలోని కొందరు మీడియాకు లీక్ ఇచ్చి దుష్ప్రచారం చేశారని అన్నారు. నేనెప్పుడూ పార్టీపై అలగలేదని.. పార్టీలోని కొందరు ఇబ్బందులు పెట్టారని బాలినేని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: