కొన్ని కొన్ని సార్లు సరదాగా మాట్లాడుకునే మాటలు కూడా ఎన్నో పెద్ద పెద్ద వివాదాలకు కారణం అవుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే . సరదా కోసం అన్న చిన్న చిన్న మాటలే చివరికి ఇద్దరి మధ్య చిచ్చు పెట్టడం లాంటివి కూడా చేస్తూ ఉంటాయని చెప్పాలి. ఇక ఇలా చిన్నగా మొదలైన గొడవ చిలికి చిలికి గాలి వానలా మారినట్లు.. ఏకంగా ఒకరిపై ఒకరు చేయి చేసుకునేంతవరకు వెళుతూ ఉంటుంది. తద్వారా ఏకంగా కొంతమంది క్షణికావేశంలో ఎదుటివారి ప్రాణాలు తీయడం లాంటివి కూడా జరుగుతూ ఉంటుంది.  ఇక ఇలాంటివి జరిగాయి అంటే చాలు ఏకంగా హత్య కేసులో చివరికి జైలు పాలు కావలసిన దుస్థితి కూడా వస్తూ ఉంటుంది.


 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఏకంగా చిన్న గొడవ కారణంగా బీహార్ లో ఒక వ్యక్తి ఏకంగా తన చెవిని పోగొట్టుకున్నాడు అని చెప్పాలి. బీహార్ వైశాలి జిల్లాకు చెందిన మనేశ్వర్ ఠాగూర్ అనే వ్యక్తి కుటుంబానికి పక్కనే తన చెల్లి కూడా నివాసం ఉంటుంది. అయితే రెండు కుటుంబాల మధ్య తరచూ ఏవో చిన్నపాటి గొడవలు జరుగుతూ ఉండేవి అని చెప్పాలి. స్థానికులు కూడా ఈ గొడవలను చూసి చూడనట్లుగానే వ్యవహరించేవారు. అయితే గత కొన్ని రోజుల క్రితం మహేశ్వర్ ఠాగూర్ తన చెల్లెలు ఇంటి వద్ద ఉన్న పొడి వంట చెరుకుపై తడివంట చెరకు పెట్టాడు.


 అయితే మామయ్య మనేశ్వర్ ఠాగూర్ ఇలా చేయడంతో మనేశ్వర్ చెల్లి కొడుకు ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయాడు. ఈ క్రమంలోనే దుర్భాషలాడాడు. ఇలా వంట చెరుకు విషయంలో ఇద్దరు మధ్య గొడవ తలెత్తింది. చివరికి చిలికి చిలికి గాలి వానా
లా మారిపోయింది.  దీంతో ఆగ్రహంతో విచక్షణ కోల్పోయిన మనేశ్వర్ అల్లుడు అతనిపై దాడి చేశాడు. ఏకంగా చెవిని కొరికేశాడు. ఇలా వీరి వివాదం ఒక్కసారిగా ముదరడంతో స్థానికులు కలగజేసుకుని మనేశ్వర్ ను  హాస్పిటల్కు తీసుకువెళ్లగా ఇక చెవిని అతికించడం వీలుకాదని వైద్యులు కూడా తెలిపారు. అందుకోసం భారీగా ఖర్చుపెట్టి ప్లాస్టిక్ సర్జరీ చేయాలి అంటూ సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: