
మొన్న భారతదేశం ఈ అధ్యక్షత స్థానాన్ని వహించింది. ఇప్పుడు రష్యా విదేశాంగ మంత్రి సర్గో అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటూనే ఐక్యరాజ్యసమితి వేదికను చక్కగా వాడుకుని అమెరికాపై విరుచుపడ్డారు ఆయన. బహుళ పార్శ్వవాదం ఇంకా అంతర్జాతీయ శాంతిపై చర్చకు అధ్యక్షత వహించిన రష్యా విదేశాంగ మంత్రి సర్గే లావరోవ్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక ఉక్రెయిన్ మిత్రవాదులు సర్గే లావరోవ్ ను విమర్శించడం ప్రారంభించారని తెలుస్తుంది. కొందరు ఉక్రెయిన్‌పై రష్యా ముఖాముఖి దాడిని కూడా విమర్శించారని తెలుస్తుంది.
అమెరికా, యునైటెడ్ కింగ్ డమ్ ఇంకా స్విట్జర్లాండ్ యొక్క అంబాసిడర్లు ఇక్కడ ఒకే గదిలో కూర్చొని రష్యా యొక్క యుద్ధాన్ని స్లామ్ చేసిన అంబాసిడర్ల పై ఐక్య రాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనీ గ్యుటేరస్ తీవ్రంగా విరుచుకుపడ్డారని తెలుస్తుంది. అక్కడ అధ్యక్షత వహించిన సర్గే లావరోవ్ ని కావాలని వీళ్ళు పెట్టిన చర్చ కార్యక్రమం ఏంటంటే, ప్రపంచ శాంతి ఇంకా ఇప్పుడు ఉన్న వివిధ సంక్షోభాలు అనే అంశం.
అయితే ఈ అంశం పైన వివిధ దేశాలన్నీ కలిసి అసలు ఈ సంక్షోభాలన్నటికీ కారణం రష్యానే అని, రష్యా చైర్మన్ ఉన్నప్పుడే అని చెప్పడంతో వాళ్లందరిపై విరుచుకుపడ్డాడు. ప్రపంచ శాంతి కావాలంటే ఏం చేయాలో మీరు చెప్పండి కానీ ఎవరు చేస్తున్నారు అనేది మీరు చెప్పద్దు అని విరుచుకుపడ్డాడు అన్నట్లుగా తెలుస్తుంది.