డబ్బు, పలుకుబడి న్యాయవ్యవస్థ మీద పెత్తనం చెలాయిస్తోందని మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  వీటిని మీడియా కూడా హైలైట్ చేస్తోంది.  మొన్నటి వరకు తెలుగు దేశం సోషల్ మీడియాలో న్యాయమూర్తులను కొన్ని పార్టీలు, కొంతమంది వ్యక్తులు కించ పరుస్తున్నారని తెగ ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు అదే టీడీపీ సోషల్ మీడియా వారియర్స్ అవినాష్ రెడ్డి విషయానికొచ్చే సరికి న్యాయ వ్యవస్థపై విమర్శలు చేస్తున్నారు. అవినాష్ రెడ్డికి బెయిల్ మంజూరుపై, శిక్ష ఖరారు చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.


అవినాష్ రెడ్డికి అనుకూలంగా  తీర్పులు ఇస్తున్నారంటూ  న్యాయమూర్తులపైనే ఆరోపణలు చేస్తున్నారు. డబ్బులు తీసుకుంటూ తీర్పును వాయిదా వేస్తున్నారని ఏకంగా న్యాయమూర్తులపైనే టీవీ డిబేట్లలో చర్చలు పెట్టి మరీ ఆరోపణలు చేస్తుండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.  దీనిపై ఏ లాయర్ స్పందించడం లేదు. ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలు చేయడం లేదు. తెలంగాణలోని బీఎస్పీ లీడర్ మాజీ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ న్యాయవ్యవస్థ కొన్ని సార్లు సరిగానే తీర్పులు ఇస్తున్నా కొన్ని కేసుల్లో డబ్బుకు, పలుకుబడికి లొంగిపోతుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి ఉదాహరణే వైఎస్ అవినాష్ రెడ్డి కేసు అని  ఇలాంటి పరిణామాలు చాలా హేయమైనవని పేర్కొన్నారు.


ఏఈ ఎగ్జామ్ టాపర్ గా నిలిచిన వ్యక్తి సిట్ విచారణలో ఒక చిన్న ప్రశ్నకు సమాధానం చెప్పకపోవడం చాలా దారుణమన్నారు. టీఎస్పీపీఎస్పీ లో జరిగిన కుంభకోణంలో కూడా టాపర్ గా నిలిచిన వ్యక్తి పేరును సీఎం కేసీఆర్ నోటి నుంచి వినాలని బీఎస్పీ కోరుకుంటోందని కానీ దానికి ఆయన నిరాకరిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయాలు కాస్త న్యాయవ్యవస్థ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసే దాకా వెళ్లడం దారుణమని కొంతమంది నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధమైన వ్యాఖ్యల వల్ల న్యాయవ్యవస్థ మీద గౌరవం సన్నగిల్లే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: