
అయితే సాయి ధరం తేజ్ దానికి సై అన్నట్టు చెప్పాడు. ఇద్దరు హీరోలు తాము కలిసి మల్టీస్టారర్ చేసేందుకు రెడీ అంటే కథ సిద్ధం చేసేందుకు రైటర్లు, దర్శకులు రెడీ అవుతున్నారు. మెగా మెనల్లుడు సాయి ధరం తేజ్.. మంచి హీరో మనోజ్ దాదాపు ఇద్దరు ఈక్వల్ ఇమేజ్ ఉన్న స్టార్స్ అయితే ఈమధ్య వరుస ఫ్లాపులతో మనోజ్ పూర్తిగా ట్రాక్ తప్పాడు. అందుకే మనోజ్ మళ్లీ తన కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
సాయి ధరం తేజ్ విషయానికి వస్తే సోలో బ్రతుకే సో బెటర్ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. ఇక త్వరలోనే దేవా కట్టా సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. మరి ఇద్దరు హీరోలు ఓపెన్ గా మేం కలిసి చేస్తామని చెప్పాక కూడా కథ ఇవ్వకపోతే అది పెద్ద మిస్టేక్ అవుతుంది. ఈ ఇద్దరిని కలిపి ఓ క్రేజీ డైరక్టర్ సినిమా తీస్తే అదరగొట్టే సినిమా వస్తుందని చెప్పొచ్చు. మరి ఈ మెగా మంచు కాంబో సినిమా ఎప్పుడు వస్తుందో చూడలి.