టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరోలైన వారు చాలా తక్కువ మందే ఉన్నారని చెప్పుకోవచ్చు. వారిలో నేచురల్ స్టార్ నాని ఒకరు కావడం విశేషం. అత్యంత సహజమైన నటనతో సినిమాలను ఒంటిచేత్తో హిట్ చేయగల సత్తా నానికి ఉందని ఎన్నోసార్లు నిరూపితమైంది. జెంటిల్ మ్యాన్, నిన్నుకోరి, ఎంసీఏ సినిమాలతో మంచి స్టార్‌డమ్‌ను సంపాదించుకున్న నాని 'జెర్సీ' తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత మంచి హిట్ లేక బాగా సతమతమవుతున్నారు.అయితే నాని తన తదుపరి సినిమా 'టక్ జగదీష్' తో అభిమానులను అలరించడానికి సిద్దం అయ్యారు. ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అవుతుందని అందరూ భావించారు కానీ ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఓటీటీలోనే రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం సిద్ధమైంది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా సెప్టెంబర్ 10వ తేదీన రిలీజ్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. అయితే తాజా సమాచారం ప్రకారం, అభిమానులను సర్ ప్రైజ్ చేసేందుకు టక్ జగదీష్ సినిమా ఒక రోజు ముందుగానే రిలీజ్ కాబోతోందని తెలుస్తోంది. సెప్టెంబర్ 9వ తేదీన సరిగ్గా రాత్రి 10 గంటల సమయంలో సినిమా రిలీజ్ కానుందని ప్రస్తుతం సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు మరో రెండు రోజుల్లో అధికారిక ప్రకటన రిలీజ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం.సెప్టెంబర్ 10న వినాయక చతుర్థి కాగా చాలామంది పండుగ బిజీలో ఉండి సినిమా అంత త్వరగా చూడకపోవచ్చు. అదే సెప్టెంబర్ 9 సాయంత్రం వేళ రిలీజ్ చేస్తే అందరూ చూడొచ్చు. ఈ ఉద్దేశంతోనే బహుశా ఈ సినిమాని ముందస్తుగా రిలీజ్ చేస్తున్నారు ఏమోనని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్, రీతూ వర్మ నటించడం విశేషం. పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందించగా.. సాహు గారపాటి, పెద్ది హరీష్ నిర్మాతగా వ్యవహరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: