కమల్ హాసన్ కూతురుగా చిత్ర పరిశ్రమకు పరిచయమైన ముద్దుగుమ్మ శృతిహాసన్.. మొదటి సినిమాతోనే హీరోయిన్ గా మంచి మార్కులు వేయించుకున్న అమ్మడు తర్వాత పవన్ కల్యాణ్ సరసన నటించి పాపులర్ అయింది. తమిళ్, తెలుగు చిత్ర పరిస్రమ లో కూడా మంచి పేరును సంపాదించుకుంది. అందుకే ఇప్పుడు బాగా పాపులర్ అయింది. చాలా మంది కుర్ర హీరోలతో పాటుగా సీనియర్ హీరో ల సరసన కూడా నటించింది.. ఇప్పుడు టాప్ హీరోయిన్ల లో ఒకటిగా హవాను కొనసాగిస్తుంది. అయితే హీరోయిన్లు అభిమానుల తో లైవ్ చాటింగ్ చెస్తారన్న సంగతి తెలిసిందే.


వారికి సంబంధించిన సినీ విషెషాలను అభిమానులతో పంచుకుంటూ వస్తున్నారు. ఇక శృతి హాసన్ కూడా అభిమానుల తో ఎప్పుడూ చాటింగ్ చేస్తూ వస్తుంది.ఈ క్రమంలోనే ఆమె తాజాగా ఫ్యాన్స్‌తో కాసేపు ముచ్చటించింది. వారు అడిగిన పలు ప్రశ్నలకు ఈ ముద్దుగుమ్మ సమాధానాలు చెబుతూ వస్తుంది. ఈ మేరకు ఓ నెటిజన్ అడిగిన ప్రశ్న ఆమెకు తీవ్ర కొపానికి గురి చేసింది.తన ఆస్తి గురించి ఓ ప్రశ్న అడిగాడు. ఆమెకు ఆస్తి ఎంత ఉంటుంది.. చెప్పాలని కోరాడు. అయితే ఇందుకు శృతి నేరుగా సమాధానం ఇవ్వలేదు.


నా ఆస్తి చాలా ఎక్కువగానే వుంటుందని అనుకుంటూన్నా అంటూ సమాధానం ఇస్తుంది. అంతేకాదు ఆమె బాయ్ ఫ్రెండ్ గురించి అడిగారు. ఇలా కొన్ని ప్రశ్నలు ఆమెను మరింత ఇబ్బంది పెట్టాయి. అంతే కాదు ఆమె తండ్రి తో చాలా థక్కువగా కనిపిస్తుంది. అందుకే ఆమె తన బాయ్ ఫ్రెండ్ తో ఉంటుందనె వార్తలు వినిపిస్తున్నాయి.. ఇకపోతే ఆమె సినిమాల విషయాన్నికొస్తే.. అమ్మడు ఇప్పుడు వరుస సినిమాలలొ నటిస్తూ బిజిగా వుంది. క్రాక్ సినిమా ఆమె రీ ఎంట్రీ సక్సెస్ ను అందించింది. దాంతో సినిమాల జొరును పెంచింది.. ఆ సినిమాలు ఇప్పుడు ఆమెకు ఎలాంటి టాక్ ను అందిస్తాయొ చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: