
మరొకవైపు కృష్ణంరాజు మరణం మరువకముందే సూపర్ స్టార్ కృష్ణ భార్య ఇందిరాదేవి మరణించారు. ఇక వెంటనే నవంబర్ నెలలో కృష్ణ కూడా మరణించడం ఇండస్ట్రీలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. సూపర్ స్టార్ కృష్ణ మరణంతో స్టార్ హీరోల మొదటి జనరేషన్ కూడా పూర్తయింది. ఇక డిసెంబర్ 23న ప్రముఖ దిగ్గజనటుడు ఎన్టీఆర్ తో సమానమైన కైకాల సత్యనారాయణ అనారోగ్య సమస్యలతో మరణించగా ఆయన మరణాన్ని మరువకముందే కేవలం 48 గంటల వ్యవధిలో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ చలపతిరావు కూడా గుండెపోటుతో మరణించారు.
ఇలా దాదాపు ఇంతమంది దిగ్గజ లెజెండ్స్ మరణించడంతో ఇండస్ట్రీలో స్వర్ణ యుగం ముగిసినట్టే అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. కళ్లతోనే హావభావాలు పలికించి.. ప్రేక్షకుల మన్ననలు పొందిన ఈ దిగ్గజ నటులు సినిమాలలోనే కాదు రాజకీయాలలో కూడా చేరి ప్రజల రుణాన్ని తీర్చుకున్నారు. ముఖ్యంగా వారికోసం ఎన్నో ప్రయత్నాలు చేసి ప్రజల బాగోగులు కోరుకున్న ఈ దిగ్గజ నటులు ఇప్పుడు మరణించడంతో కేవలం సినీ ప్రేమికులే కాదు యావత్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా వీరిని మర్చిపోలేకపోతున్నారు. వీరు మన మధ్య లేకపోయినా వీరి సినిమాలు మాత్రం సినీ పరిశ్రమ ఉన్నన్నాళ్లు ఉంటాయి. అలాగే ప్రేక్షకుల మధ్యలో శాశ్వతంగా నిలిచిపోతారనటంలో సందేహం లేదు. ఇంతమంది దిగ్గజనటులను బలి తీసుకున్న ఈ 2022వ సంవత్సరం బ్లాక్ ఇయర్ గా పేరు తెచ్చుకుంది.