టాలీవుడ్ లో అడుగు పెట్టిన తక్కువ కాలానికే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది రష్మిక మందన. ఆమె వరుస హిట్స్ కొడుతూ కెరీర్ లో పీక్ స్టేజి కి వెళ్ళింది అనే సంగతి తెలిసిందే. అగ్ర హీరోలతో వరుసగా సినిమాలు చేస్తూ ఈ ఏడాది ఏకంగా రెండు హిట్స్ కొట్టింది కన్నడ బ్యూటి. ఇప్పుడు ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో ఆమెను తీసుకునే అవకాశం ఉంది అనే వార్తలు టాలీవుడ్ వర్గాల్లో వినపడుతున్నాయి. అయితే సమంతాకు కూడా అవకాశం ఉంది అని అంటున్నారు. మరి అది నిజమా కాదా అనేది చూడాలి. 

 

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఆమెకు మంచి ఆఫర్ వచ్చేసింది కోలీవుడ్ లో. విజయ్ హీరో గా వచ్చే సినిమాలో ఆమె నటించే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. వాస్తవానికి విజయ్ తో ఆమె గతంలోనే ఒక సినిమా చెయ్యాల్సి ఉంది. కాని అప్పుడు కుదరలేదు. ఇప్పుడు మరో సినిమాకు ఆమెను తీసుకున్నారు అని ఆమె డేట్స్ కూడా ఇచ్చింది అని సమాచారం. ఈ ప్రాజెక్ట్ ని దసరా తర్వాత మొదలు పెట్టే అవకాశం ఉందని, ఆమె పుష్ప సినిమా తో పాటుగా ఆ సినిమాలో కూడా చేస్తారు అని అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ కి ఆమె భారీగానే డిమాండ్ కూడా చేసింది అని సమాచారం.

 

అయినా సరే ఆ సినిమాను తెలుగులో, కన్నడం లో కూడా విడుదల చెయ్యాలి అని అక్కడ ఆమెకు ఫాలోయింగ్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది అని ఆమెను తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలుపెట్టే అవకాశం ఉంది అనేది చూడాలి. టాలీవుడ్ లో ఇప్పుడు ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నా సరే ఇతర భాషల మీద కూడా ఫోకస్ చేస్తుంది ఈ బ్యూటి...

మరింత సమాచారం తెలుసుకోండి: