సినీ ఇండస్ట్రీలోకి రావాలని ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేసి , చివరికి కొంతమంది సక్సెస్ ను సాధిస్తే, మరికొంతమంది నిరాశగా తిరిగి వెళుతూ ఉంటారు. మరి కొంతమంది సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, అనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదుగుతూ ఉంటారు. అయితే సినీ ఇండస్ట్రీ లో రావడానికి ఎంతో కష్టపడితేనే అవకాశాలు దొరకడం చాలా కష్టంగా ఉంటుంది. ఇక అలా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ, ముందడుగు వేయడం వల్ల జీవితంలో మంచి స్థానాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంటుంది.

ఇకపోతే సినీ ఇండస్ట్రీలోకి మొదటి ప్రయత్నంతోనే వచ్చి, మంచి విజయాన్ని అందుకున్న ఎంతోమంది హీరోలు,  అర్థంతరంగా సినీ ఇండస్ట్రీకి గుడ్బై చెబుతూ ఉంటారు. అయితే వారికి సినీ ఇండస్ట్రీలో అవకాశాలు రాకనో లేక వేరే రంగం ఏదైనా వారిని ఆకర్షించడమో వంటి కారణాల వల్ల, వారు సినీ ఇండస్ట్రీకి దూరం అవుతూ ఉంటారు. అయితే ఇప్పుడు కూడా ఒక యువ హీరో సినీ ఇండస్ట్రీకి దూరం కావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక  అతను ఎవరో కాదు.. తమిళ హీరో ఉదయనిధి స్టాలిన్.

ఇతను కేవలం తమిళ్ ప్రేక్షకులకు మాత్రమే కాదు తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా పరిచయమే. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించాడు. తనలో ఉన్న ప్రతిభను నటన రూపంలో చూపించి,  ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఉదయనిధి త్వరలోనే సినీ ఇండస్ట్రీకి దూరం కానున్నాడట.  ప్రస్తుతం ఈ విషయం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే తను సినీ ఇండస్ట్రీ కి ఎందుకు దూరం కావాలి అనుకుంటున్నాడు అంటే , తన తండ్రిలాగే తాను కూడా రాజకీయవేత్తగా ఎదగాలి అనేది తన చిరకాల కోరిక అట.

అయితే ఇక తన తండ్రి తమిళనాడు సీఎం గా స్టాలిన్ ఉన్న విషయం తెలిసిందే. ఇక అందుకే తన తండ్రి బాటలోనే ఉదయనిది కూడా నడవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తాను అన్నాడు ఉదయనిధి.


మరింత సమాచారం తెలుసుకోండి: