అక్కినేని అఖిల్ కొంత కాలం క్రితం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. గీత ఆర్ట్స్ బ్యానర్ వారు రూపొందించిన ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ మూవీ తో అఖిల్ కెరియర్ లో మొట్ట మొదటి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఇకపోతే కెరియర్ లో మొట్ట మొదటి విజయాన్ని అందుకున్న అఖిల్ ఆ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఏజెంట్ అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు.

సాక్షి వైద్య ఈ మూవీ లో హీరోయిన్ గా నటించిన మలయాళ నటుడు మమ్ముట్టిమూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఇకపోతే భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర గోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఇకపోతే ఏజెంట్ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత అఖిల్ తదుపరి మూవీ కి సంబంధించిన అప్డేట్ ఇప్పటి వరకు విడుదల కాలేదు. ఇకపోతే తాజాగా ఈ నటుడి నెక్స్ట్ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... అఖిల్ తన నెక్స్ట్ మూవీ ని తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నిర్మాణ సంస్థలలో ఒకటి అయినటువంటి యు వి క్రియేషన్స్ బ్యానర్ లో చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ బ్యానర్ వారు అనిల్ అనే కొత్త దర్శకుడి తో అఖిల్ తో మూవీ ని తెరకెక్కించడానికి ప్లాన్స్ చేస్తున్నట్లు అందులో భాగంగా ప్రస్తుతం ఈ మూవీ బృందం అఖిల్ తో రూపొందించబోయే మూవీ పై కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: