నందమూరి బాలకృష్ణ తాజాగా మెన్షన్ హౌస్ మద్యపానం బ్రాండ్ కి సంబంధించి ఒక యాడ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ యాడ్ వైరల్ అయిన క్షణాల్లోనే బాలకృష్ణ పై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తాయి.ముఖ్యంగా ఒక స్టార్ హీరో హోదాలో ఉన్న ఈయన పద్మభూషణ్ అవార్డు అందుకున్న ఈయన ఇలాంటి మద్యపానం యాడ్లో నటించి సభ్య సమాజానికి ఏ మెసేజ్ ఇద్దామని అంటూ ఎంతోమంది జనాలు ఈయనపై దుమ్మెత్తి పోస్తారు.అంతే కాదు చాలామంది హీరోలు చేసే పనులనే ఆదర్శంగా తీసుకొని అభిమానులు కూడా అలాగే ప్రవర్తిస్తారు. ఒక హీరోనే మందు తాగండి అని ప్రచారం చేస్తే ఆయన అభిమానులు దాన్ని పాటించకుండా ఉంటారా.. హీరోలు ఏది చేస్తే దాన్నే ఫాలో అయ్యే ఈ అభిమానుల ముందు ఇలాంటి పెద్ద హీరో స్థాయిలో ఉన్న బాలకృష్ణ అలా మద్యం ప్రచారం చేయడం ఏమైనా బాగుందా..

అసలు పద్మభూషణ్ అవార్డు తీసుకున్న హీరో చేయాల్సిన పనులేనా ఇవి అంటూ ఎంతో మంది బాలకృష్ణపై విమర్శలు చేశారు. ఓ వర్గం ప్రజలు అయితే బాలకృష్ణ చేసిన యాడ్ పై దుమ్మెత్తి పోసారు.కానీ దీనిపై బాలకృష్ణ స్పందించలేదు. గతంలో చిరంజీవి ఒక థంసప్ యాడ్లో చేస్తే ఆ తంసప్ కారణంగా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అనే ప్రచారం చేయడంతో చిరంజీవి అసలు యాడ్ చేయడమే మానేశారు. అలాంటిది బాలకృష్ణ అంత పెద్ద స్థాయిలో ఉండి ఇలా మద్యం ప్రచారం చేయడం ఏంటి అని మాట్లాడుకుంటున్నారు.అయితే ఈ నేపథ్యంలోనే బాలకృష్ణపై ఆయనతో నటించిన స్టార్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు చేసింది.

అయితే బాలకృష్ణ పేరు వాడకపోయినప్పటికీ ఆమె మాట్లాడిన మాటలు మాత్రం బాలకృష్ణకి కరెక్ట్ గా సెట్ అవుతున్నాయి.ఇంతకీ ఆమె ఏం మాట్లాడిందంటే.. సెలబ్రిటీలు మధ్యాన్ని ప్రచారం చేయకూడదు. యువత సెలబ్రిటీలను ఫాలో అవుతూ ఉంటారు. అయితే సెలబ్రిటీలు ఇలాంటి ఆల్కహాల్ ప్రచారాలు చేస్తే యూత్ ని తప్పుదారి పట్టించినట్లే అంటూ రవీనా టాండన్ ని చెప్పింది.అయితే రవీనా టాండన్  మాట్లాడిన మాటలు బాలకృష్ణ చేసిన యాడ్ కి కరెక్ట్ గా సెట్ అవుతున్నాయి అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: