సో.. గత పాతికేళ్ల నుంచి రాజమౌళి ఫస్ట్ హీరో ఎన్టీఆర్ అని అందరూ భావించారు. కానీ అది నిజం కాదంటున్నాడు ప్రముఖ నటుడు, బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ మండా. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన కౌశల్.. ఆ తర్వాత నటుడిగా మారి పలు సీరియల్స్ మరియు సినిమాలు చేశాడు. అలా సంపాదించుకున్న క్రేజ్‌తో బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 2లోకి అడుగుపెట్టి టైటిల్ విన్నర్ గా నిలిచింది. కానీ ఆ తర్వాత అటు బిగ్ స్క్రీన్ తో పాటు ఇటు స్మాల్ స్క్రీన్ పై కూడా కౌశల్ కనిపించడం అరుదుగా మారిపోయింది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కౌశల్ మండా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించి ఎన్నో ఆసక్తికర సంగతులు పంచుకున్నాడు. ఈ క్రమంలోనే రాజమౌళి ఫస్ట్ హీరో ఎన్టీఆర్ కాదు తానే అంటూ ఓ టాప్ సీక్రెట్‌ను బయటపెట్టారు. సినిమాల కన్నా ముందు రాజమౌళి పలు సీరియల్స్, యాడ్స్ ను డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. రాజమౌళి మొట్టమొదట గవర్నమెంట్ కి సంబంధించి ఓ వాటర్ యాడ్ కోసం మెగా ఫోన్ పట్టారు. ఈ యాడ్ ను జక్కన్నకు ఇచ్చింది ఆయన గురువు రాఘవేంద్రరావు గారు. అయితే అందులో మెయిన్ లీడ్‌గా యాక్ట్ చేశాడు కౌశల్ మండా. రాఘవేంద్రరావు గారే ఆ వాటర్ యాడ్‌కు తనను సజెస్ట్ చేశారని.. రాజమౌళి గారు ఫస్ట్ యాక్షన్, కట్ చేప్పింది తనకే అని, ఆయన ఫస్ట్ హీరో తానే అని తాజా ఇంటర్వ్యూలో కౌశల్ చెప్పుకొచ్చాడు. ఇక ఆ తర్వాత రాజమౌళి డెబ్యూ మూవీ `స్టూడెంట్ నెంబర్ 1`కు కౌశల్ క్యాస్టింగ్ డైరెక్టర్ గా వర్క్ చేయడం జరిగిందట.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి