
ఇక ట్రేడ్ టాక్ ప్రకారం, రజినీకాంత్ “కూలీ” సినిమా ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజే సుమారు రు. 150 కోట్ల ఓపెనింగ్స్ సాధించింది. అదే స్థాయి రేంజ్ ఓపెనింగ్స్ “ఓజీ”కు కూడా వచ్చే అవకాశముందని ట్రేడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ముఖ్యంగా, “కూలీ”కు ఓవర్సీస్ మార్కెట్ బలంగా ఉండగా, “ఓజీ”కు మాత్రం ప్రీమియర్ షోలు మరియు తెలుగు రాష్ట్రాల్లోని ఫ్యాన్స్ ఊగిపోతుండడంతో ఇక్కడ ఎక్కువ వసూళ్లు వస్తాయని లెక్కలు వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాకు ఉండే ఫ్యాన్ బేస్ దృష్ట్యా, ఈసారి థియేటర్ల ముందు ఫ్యాన్స్ ఫెస్టివల్ వాతావరణం నెలకొంది. మొదటి రోజు వసూళ్లలో “ఓజీ” కొత్త రికార్డులు సృష్టిస్తుందని, బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందని విశ్లేషకులు నమ్ముతున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు