ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రపతిని కలిసిన అంశం బాగా హైలెట్ అయింది. రాష్ట్రపతిని కలిసిన తర్వాత ఆయన ఏ రాజకీయాలు చేస్తారు ఏంటీ అనే దానిపై అందరూ కూడా చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇక ఏపీ వైసీపీ నేతలు కూడా రాష్ట్రపతి వద్దకు వెళ్లి ఫిర్యాదు చేస్తామని అన్నారు. ఇక టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని వైసీపీ నేతలు కాస్త ఎక్కువగా డిమాండ్ చేసే పరిస్థితి కనపడుతుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఆ వైసీపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసారు.

దీని తర్వాత ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పరిణామాలు, టీడీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను కేంద్ర ఎన్నికల సంఘానికి వివరిస్తూ మెమోరాండంలో ఇచ్చాము అని ఆయన పేర్కొన్నారు. బోండా ఉమ, నారా లోకేష్, అయ్యన్న పాత్రుడు, దేవినేని ఉమ, పట్టాభి లు ముఖ్యమంత్రి పై చేసిన వ్యాఖ్యలను వివరించాము అని తెలిపారు. నాగరిక సమాజంలో చేసిన అనాగరిక వ్యాఖ్యలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమీషనర్, ఇతర కమీషనర్ కు వివరిస్తే వాళ్లు ఆశ్చర్యపోయారు అని అన్నారు.

టీడీపీ తెలుగుదొంగల పార్టీగా మారింది. తాలిబన్ల కంటే అనాగరికంగా వ్యవహరిస్తున్నారు అని విమర్శించారు. టెర్రరిస్ట్ అవుట్ ఫీట్ గల టీడీపీ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని కోరాము  అని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేతల పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీలను పంపాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమీషనర్, ఇతర కమీషనర్ కోరారు అని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న శాసనమండలి సభ్యుల పదవులకు సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు జరపాలని కోరాము అని ఆయన పేర్కొన్నారు. త్వరలో భర్తీ చేస్తామని కేంద్ర ఎన్నికల సంఘం హామీ ఇచ్చిందని ఎంపీ మీడియాకు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: