అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి దెబ్బకు చంద్రబాబునాయుడుకు మైండ్ బ్లాంక్ అయిపోయినట్లే ఉంది. అమరావతి రాజధాని నిర్మాణం విషయంలో కోర్టు తీర్పు ఆచరణ సాధ్యంకాదన్నారు. కోర్టుతీర్పు తమ ప్రభుత్వానికి ఆమోదంకాదని చెప్పారు. మూడురాజధానుల నిర్మాణమే తమ ప్రభుత్వ విధానమని మరోసారి అసెంబ్లీ వేదికగా స్పష్టంగా ప్రకటించారు. జగన్ తన వైఖరి చెప్పారో లేదో వెంటనే చంద్రబాబునాయుడు మీడియా ముందుకొచ్చేశారు.






జగన్ ది వితండ విధానమంటు మండిపోయారు. హైకోర్టు తీర్పును అమలు చేయాల్సిందే అంటు గట్టిగా చెప్పారు. హైకోర్టు తీర్పు ఆచరణసాధ్యం కాదనుకుంటే సుప్రికోర్టుకు వెళ్ళాలే కానీ కోర్టు తీర్పు ఆచరణ సాధ్యంకాదని చెప్పటమం ఏమిటంటు ఆగ్రహం వ్యక్తంచేశారు. న్యాయస్ధానాల పవిత్రతపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా అంటు కోపంతో ఊగిపోయారు. కోర్టు తీర్పుతో రాజీనామాలు చేసిన ముఖ్యమంత్రలున్నారని గుర్తుచేశారు. రాజీనామా చేసి ప్రాజభిప్రాయం కోరాలంటు పాత పాటే పాడారు.





ఇక్కడ గమనించాల్సిందేమంటే ఇక్కడవ్యవహారం రాష్ట్రప్రభుత్వం-హైకోర్టుదే. మధ్యలో చంద్రబాబు జోక్యం చేసుకోవాల్సిన అవసరమే లేదు. కోర్టు తీర్పును అమలు చేయాలా ? వద్దా ? అనేది పూర్తిగా ప్రభుత్వ ఇష్టంపై ఆధారాపడుంటుంది. కోర్టు తీర్పు చాలా పవిత్రమని ఇపుడు చెబుతున్న చంద్రబాబు కూడా గతంలో లెక్కచేయని సందర్భాలున్నాయి. అమరావతి నిర్మాణంలో స్విస్ ఛాలెంజ్ విదానం వద్దని హైకోర్టు చెబితే చంద్రబాబు పట్టించుకోలేదు. అలాగే స్ధానికసంస్ధల ఎన్నికలను మూడు నెలల్లో నిర్వహించాలని హైకోర్టు 2018, జూలైలో తీర్పిస్తే చంద్రబాబు లెక్కేచేయలేదు. తాజాగా కోర్టు తీర్పుపైనే డైరెక్టుగా జగన్ మాట్లాడుతాడని బహుశా చంద్రబాబు ఊహించలేదు. అందుకనే మైండ్ బ్లాంక్ అయిపోయింది.







కాబట్టి చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు ఒకలాగ ప్రతిపక్షంలో మరోలాగ వ్యవహరిస్తారన్న విషయం తెలిసిందే. కోర్టు తీర్పును పాటించకపోతే ఏమవుతుందనేది జగన్ సమస్య. తన తీర్పును జగన్ బేఖాతరు చేస్తే ఏమిచేయాలో హైకోర్టే చూసుకుంటుంది. అంతేకానీ మధ్యలో చంద్రబాబు బాధపడాల్సిన అవసరమేలేదు. ఇక రాజీనామా చేసి ప్రజాభిప్రాయం కోరాలట. తమకు ప్రజామద్దతు ఉందని జగన్ అనుకుంటున్నారు కాబట్టి రాజీనామా చేసే ప్రసక్తే లేదని మంత్రులు గతంలోనే ప్రకటించారు.







ప్రజాభిప్రాయం కోసం టీడీపీ ఎంఎల్ఏలనే రాజీనామాలు చేయమని మంత్రులు గట్టిగా సమాధానమిచ్చారు. కాబట్టి మూడు రాజధానులపై జగన్ నిర్ణయం తప్పని తాము రాజీనామాలు చేసి మళ్ళీ గెలిచి నిరూపించే అవకాశం చంద్రబాబుకే ఉంది. కాబట్టి రాజీనామాలు చేయమని వైసీపీని డిమాండ్ చేసేబదులు చంద్రబాబే తన ఎంఎల్ఏలతో రాజీనామాలు చేయించవచ్చుకదా ?


మరింత సమాచారం తెలుసుకోండి: