ఎన్టీయార్ శతజయంతి ఉత్సవాలకు జూనియర్ ఎన్టీయార్ హాజరుకాకపోవటం పెద్ద ఇష్యూ అవుతోంది.  శతజయంతి ఉత్సవాల పేరుతో అంతకుముందు రాష్ట్రంలో జరిగిన ఏ కార్యక్రమానికి జూనియర్ ను ఆహ్వానించలేదు. మొత్తం వ్యవహారాలను చంద్రబాబునాయుడు, నందమూరి బాలకృష్ణే దగ్గరుండి నడిపించారు. చివరకు పోరంకిలో జరిగిన కార్యక్రమానికి చెన్నై నుండి రజనీకాంత్ ను పిలిచారే కాని జూనియర్‌ను మాత్రం పిలవలేదు. దాంతో చంద్రబాబు, బాలయ్య, టీడీపీపై పెద్దఎత్తున ట్రోలింగ్ జరిగింది.

దాన్ని మనసులో పెట్టుకునో ఏమో హైదరాబాద్ లో జరిగిన ఉత్సవాలకు జూనియర్‌ను ఆహ్వానించారు. ఎన్టీయార్ కొడుకు నందమూరి రామకృష్ణ, టీడీపీ సీనియర్ నేత టీడీ జనార్ధనరావు పర్సనల్ గా జూనియర్ ఇంటికి వెళ్ళి ఇన్విటేషన్ ఇచ్చారు. అయితే ఉత్సవాలు జరిగే రోజున తాను మాల్దీవులకు వెళుతున్న కారణంగా కార్యక్రమానికి హాజరుకాలేకపోవచ్చని అప్పుడే జూనియర్ చెప్పేశారు. ఆరోజు కార్యక్రమం జరిగిపోయింది.

అయితే రెండురోజుల తర్వాత నుండి జూనియర్ పై ట్రోలింగులు మొదలయ్యాయి. చివరకు అవి పీక్స్ కు చేరుకుని నందమూరి బాలయ్య అభిమానులు, టీడీపీ అభిమానులు-జూనియర్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరుగుతున్నట్లుంది. బాలయ్య+టీడీపీ అభిమానులు జూనియర్‌ను చాలా దారుణంగా అవమానిస్తున్నారు. జూనియర్ పుట్టుక దగ్గరనుండి మొదటుపెట్టి ‘కనకపు సింహానం’ అంటు ఏమిటేమిటో సంబంధంలేని పద్యాలు, సామెతలు అన్నింటినీ వాడేస్తున్నారు. సోషల్ మీడియాలో జూనియర్‌ను దారుణంగా ర్యాగింగ్ చేస్తున్నట్లే ఉంది.

జూనియర్‌ను నందమూరి ఫ్యామిలీలో చాలామంది దూరంగా పెట్టింది వాస్తవం. సినిమా ఫీల్డులో తనంతట తానుగా నిలదొక్కుకున్నాకే జూనియర్‌ను అప్పుడప్పుడు అదికూడా అవసరమైనపుడు మాత్రమే దగ్గరకు తీసుకుని వెంటనే దూరంపెట్టేస్తున్నారు. తండ్రి నందమూరి హరికృష్ణ మరణించిన తర్వాత అదికూడా లేదు. వాళ్ళ ఇళ్ళల్లో జరిగే ఫంక్షన్లకు కూడా పెద్దగా పిలవటంలేదు. అలాంటిది ఇపుడు ఎన్టీయార్ ఉత్సవాలకు పిలవటం టీడీపీ ఇష్టం, హాజరవ్వటం, కాకపోవటం జూనియర్ ఇష్టం. మధ్యలో అభిమాన సంఘాలు ఎందుకు ర్యాగింగ్ చేస్తున్నాయో అర్ధంకావటంలేదు.  సోషల్ మీడియాలో జరుగుతున్న వ్యవహారాలు చంద్రబాబు, బాలయ్య, జూనియర్ దృష్టికి వెళ్ళే ఉంటాయనటంలో సందేహంలేదు. మరి ఇది ఎంతదూరం వెళుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: