కడప ఎంపీ అవినాష్ రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వటంతో చాలామంది ఏడుస్తున్నారు. వివేకానందరెడ్డి మర్డర్ కేసులో అవినాష్ రెడ్డికి ఎట్టిపరిస్ధితుల్లోను బెయిల్ రాకూడదని చాలమంది బలంగా కోరుకున్నారు. ఎప్పుడైతే బెయిల్ వచ్చేసిందో వెంటనే వీళ్ళ ఏడుపు స్టార్టయిపోయింది. బెయిల్ ఇచ్చిన హైకోర్టుమీద మంటను తమ్ముళ్ళు బాహాటంగానే చూపించేస్తున్నారు. బెయిల్ విషయంలో సీబీఐ అభ్యంతరాలను జడ్జి పక్కనపెట్టేయటాన్ని వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ సీనియర్ నేత వర్లరామయ్య అయితే అవినాష్ ను ఏకంగా ముద్దాయనే ప్రకటించేశారు.

వివేకానందరెడ్డి మర్డర్ కేసులో అవినాషే ముద్దాయని వర్ల తీర్పిచ్చేశారు. ముద్దాయికి కోర్టు ఎలా బెయిలిస్తుందని మండిపోయారు. వివేకా హంతకుల్లో కీలకమైన దస్తగిరి హ్యాపీగా బయటతిరగటం వర్లకు అభ్యంతరంగా అనిపించలేదు.  ఇక వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురాజుకు అయితే ఏడుపొకటే తక్కువ. మంగళవారం వరకు ఎట్టిపరిస్ధితుల్లోను అవినాష్ కు బెయిల్ వచ్చే ప్రసక్తేలేదని బల్లగుద్ది మరీ వాదించారు. అలాంటిది బుధవారం బెయిల్ వచ్చినదగ్గర నుండి ఎల్లోమీడియాలో కనబడలేదు.

ఇక ఎల్లోమీడియా ఏడుపైతే చెప్పనే అక్కర్లేదు. తాత్కాలిక బెయిల్ ఇచ్చినపుడు ఏబీఎన్ ఛానల్లో సస్పెండయిన వివాదాస్పద జడ్జి రామకృష్ణ మాట్లాడుతు జడ్జి లక్ష్మణ్  డబ్బులమూటలు తీసుకుని బెయిలిచ్చారని ఆరోపించిన విషయం తెలిసిందే. దానిపై మండిపోయిన జస్టిస్ లక్ష్మణ చాలా సీరియస్ గా రియాక్టయ్యారు. తనపై ఆరోపణలు చేసిన రెండు ఛానళ్ళపై యాక్షన్ తీసుకోవాలని చీఫ్ జస్టిస్ కు ఫిర్యాదుచేశారు.

దాంతో బెయిల్ వచ్చిన విషయాన్ని ఏబీఎన్ పెద్దగా ప్రస్తావించకుండా ఢిల్లీ పర్యటనలో అమిత్ షా తో జగన్మోహన్ రెడ్డి చీకటిభేటీ అని, అవినాష్ విచారణ, అరెస్టు, రిమాండ్ రిపోర్టులో తనపేరు రావటంపై జగన్ భోరుభోరుమన్నారని పెద్ద కథనాన్ని ప్రసారంచేసింది. జస్టిస్ లక్ష్మణ్ దెబ్బకు బెయిల్ పై డిబేట్ పెట్టకుండా పార్లమెంటులో సీట్ల పెంపు, జనాభా నియంత్రణపాటిస్తున్న రాష్ట్రాలంటు ఏదేదో మాట్లాడించింది. మరో ఛానల్ మహాన్యూస్ అయితే జస్టిస్ లక్ష్మణ్ మీద తప్పుడు ఆరోపణలు చేసినందుకు హైకోర్టుకు క్షమాపణలే చెప్పేసింది. అవినాష్ బెయిల్ తెచ్చుకుంటే ఇంతమంది ఏడుస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: