ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పిన సూపర్ సిక్స్ హామీలలో మరొకటి అమలు చేసింది. అదే తల్లికి వందనం.. అయితే ఇందులో కూడా చాలానే లోపాలు ఉన్నాయనే విధంగా ప్రజలు తెలుపుతున్నారు. గతంలో జగన్ తీసుకువచ్చిన అమ్మ ఒడి పథకం మీద కూడా ఏవో ఒక స్టోరీలు టిడిపి అనుకూల మీడియాలు రాసేవి. ఇక జగన్ అనుకూల మీడియాలో తల్లికి వందనం గురించి రాస్తున్నారు. అటు అమ్మ ఒడి అద్భుతమే ఇటు తల్లికి వందనం కూడా అద్భుతం అని చెప్పవచ్చు. అయితే అమ్మ ఒడిలో ఒక్కరికి ఇస్తే తల్లికి వందనంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు.


అయితే ఎక్కడైనా సరే కొన్ని లోపాలు జరుగుతూ ఉంటాయి.. ఇటీవలే తులసి రెడ్డి గారు చెప్పినట్లుగా తొమ్మిది లక్షల మందికి తగ్గినట్లుగా తెలియజేశారు. వాటికి మెయిన్ రీజన్స్ కూడా ఉండవచ్చు.. అంతేకాకుండా ఎస్సీ ఎస్టీలకు స్కాలర్షిప్ వస్తుంది కాబట్టి ఇవ్వలేదని .. కొన్ని స్కూళ్లకు ఇవ్వట్లేదు అన్నటువంటి అంశం ఇప్పుడు ప్రొజెక్ట్ చేసుకోస్తున్నారు. తాజాగా చూస్తే 300 యూనిట్ల పేరుతో చెప్పుకొని చాలామందిని కటాఫ్ చేశారు అంటూ కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందంటూ వైసీపీ సపోర్టు మీదే తెలుపుతోంది. అలాగే కొంతమందికి ల్యాండ్ ఎక్కువగా ఉందని రాలేదని తెలుపుతున్నారు.. దీంతో ప్లాంట్ లేకపోయినా కూడా ఎక్కువగా చూపిస్తావు ఉండడంతో తల్లులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.



కొందరి పేరును అసలు విద్యుత్ మీటర్లే లేవని.. మరి కొంత మంది మీద ఏకంగా 10 నుంచి 15 మీటర్లు ఉన్నట్లుగా చూపిస్తున్నారని.. వాటి వల్ల తల్లికి వందనం లేకుండా చేశారని కొంతమంది తల్లులు విద్యుత్ అధికారుల వద్ద కూడా ఆవేదనను తెలియజేస్తున్నారంటు తెలుపుతున్నారు.. తమకు ఓకే మీటర్ ఉన్నప్పుడు తమ పేరు మీద ఇన్ని మీటర్లు ఎలా వస్తున్నాయి అంటూ నిలదీస్తున్నారట. తల్లికి వందనం లబ్ధిదారులను సైతం తగ్గించేందుకు ప్రభుత్వం ఇలాంటి కుట్ర పడుతోందా అంటూ ఆగ్రహాన్ని తెలుపుతున్నారు. ముఖ్యంగా పిఠాపురం, తిరుపతి, కాకినాడ, తుని, సామర్లకోట, నంద్యాల, అనంతపురం, కడప, కర్నూల్, ఒంగోలు తదితర ప్రాంతాలలో సబ్స్టేషన్ దగ్గర తల్లులు స్టేట్మెంట్స్ కూడా తీసుకోవడానికి బారులు తిరుగుతున్నారట. అయితే ఒక ఏడాది స్టేట్మెంట్ అధికారులను అడగగా కానీ సబ్ స్టేషన్ అధికారులు ఆరు నెలలది మాత్రమే ఇస్తున్నారట. మరి వీటి పైన కూటమి ప్రభుత్వ సరైన చర్యలు తీసుకొని తల్లికి వందనం పథకానికి అర్హులయ్యేలా చూస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: