
ఆసియా కప్ గెలిచేందుకు టీమిండియా కు అన్ని రకాల అర్హతలు ఉన్నాయని.. కానీ టీమిండియా ఆటగాళ్ల పేలవ ప్రదర్శన చివరికి మొదటికే మోసం తెచ్చింది అంటూ విమర్శలు కూడా గుప్పించారు అని చెప్పాలి. అయితే టీమిండియా ఆసియా కప్ గెలవ లేక పోయింది అన్న నిరాశను ఇక ఎప్పుడు భారత మహిళల జట్టు తీర్చబోతుంది అన్నది తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం మహిళల ఆసియా కప్ జరుగుతుండగా టీమిండియా మహిళల జట్టు విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది.
ప్రత్యర్ధులందరినీ కూడా చిత్తుగా ఓడిస్తూ విజయ డంకా మోగిస్తుంది అని చెప్పాలి. ఇప్పటికే ఐదు మ్యాచ్లలో నాలుగు విజయాలు సాధించిన టీమ్ ఇండియా మహిళలు జట్టు ఇటీవల థాయిలాండ్ తో జరిగిన టి20 మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన థాయిలాండ్ జట్టు 15.1 ఓవర్ లలో 37 పరుగులకే ఆల్ అవుట్ అయింది. అయితే భారత జట్టు ఆరు ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని చేదించింది. కాగా అంతర్జాతీయ టి20 84 బాల్స్ మిగిలి ఉండగానే గెలిచి ప్రపంచ రికార్డు సృష్టించింది భారత మహిళల జట్టు. ఇండియా దూకుడు చూస్తే ఆసియా కప్ గెలిచేటట్టుగానే కనిపిస్తుంది.