కొన్నిసార్లు కొన్ని కొన్ని చిత్ర విచిత్ర వీడియో వైరల్ అయినప్పుడు అందరు మాట్లాడుకునే ప్రధాన అంశం "కలియుగం  అంతరించిపోబోతుందేమో..?" అందుకే ఇలా జరుగుతుందేమో..? అంటూ కచ్చితంగా కామెంట్స్ వినిపిస్తాయి . మరి ముఖ్యంగా ఏదైనా చేయలేని పని ఎవరైనా చేసి చూపించినప్పుడు . చెయ్యకూడని పని చేసినప్పుడు . ఇలాంటి కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తాయి . ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ గా మారింది.  అది కూడా ఒక మహిళ చేయడం పట్ల చాలామంది జనాలు చిత్రవిచిత్రంగా మాట్లాడుకుంటున్నారు.  చాలామందిలో ఉన్న ఒక అభిప్రాయం ఏంటంటే  ఆడవాళ్లు కంటే మగవాళ్లు స్ట్రాంగ్గా ఉంటారు.  మగవాళ్ళు ఏ పనైనా చేసేస్తారు . ఆడవాళ్లు అలా చేయలేరు .


ఫిజికల్ ఆక్టివిటీ కి సంబంధించిన పనులు అసలే చేయలేరని అంతా అనుకుంటూ ఉంటారు.  కానీ ఓ మహిళ మాత్రం అలాంటివంత నమ్మకండి అంటూ ప్రూవ్ చేసింది . ఏకంగా కొండనే అవలీలగా ఎక్కింది . దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. మహిళ కొండపై ఒంటరిగా నడుస్తుంది.  అందులో విశేషం ఏముంది..? అని అనుకుంటున్నారా . కొండపై ఎలాంటి సేఫ్టీ లేకుండా ప్రమాదకర సాహసాలు చేయడం చూసి అంతా అవాక్కైపోతున్నారు . ఏటవాలుగా ఉన్న కొండపై ఒంటరిగా ఉన్న మహిళ నడవడమే కాదు .. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా పైకి ఎక్కుతూ ఉండడం ఈ వీడియోలో చూడొచ్చు.



అది కూడా పూర్తిగా ఏటవాలుగా ఉన్న కొండను ఎంతో అవలీలగా చాక్లెట్ తిన్నంత ఈజీగా చకచకా ఎక్కిస్తుంది . ఒక్క సేఫ్టీ ప్రికాషన్స్ లేకుండానే అలా కొండను ఎక్కేస్తూ ఉండడం అందరికీ ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. అయితే ఆమెకి దైవ లీలలు ఉన్నాయని కొంతమంది మాట్లాడుతుంటే .. మరి కొంతమంది మాత్రం ఆమె ట్రైనింగ్ తీసుకొని ఉండొచ్చు అని కూడా మాట్లాడుతున్నారు. మరి కొంతమంది జనాలు మాత్రం అసలు ఇలాంటి సాహసాలు అవసరమా..? ఏదైనా జరగరానిది జరుగుంటే అంటున్నారు . ఎక్కువ మంది  కలియుగం అంతరించిపోయేముందు ఇలాంటివే చూడాల్సివస్తుంది..త్వ్రరలోనే యుగాంతం అనడానికి కొన్ని కొన్ని ఎగ్జామ్పుల్స్ ఇవే అంటూ వెటకారంగా కౌంటర్స్ వేస్తున్నారు. అయితే ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. మహిళలు ఈ వీడియోని ఎక్కువగా లైక్ చేస్తూ వైరల్ చేస్తున్నారు . ఈ వీడియో ప్రస్తుతం 4700 కి పైగా లైకులు అలాగే 3.54 లక్షలకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది..!




మరింత సమాచారం తెలుసుకోండి: