ముందొచ్చిన చెవుల కంటేకూడా వెనకొచ్చిన కొమ్ములు వాడి! అనే సామెత‌ను వైసీపీ నాయ‌కులు గుర్తు చేస్తున్నారు. దీనికి కార‌ణం.. మ‌రో నాలుగు రోజుల్లో కొత్త మంత్రి వ‌ర్గం ఏర్పాటు కానుండ‌డ‌మే ఇప్ప‌టికే చాలా వ‌ర‌కు కొత్త మంత్రులు ఎవ‌రు?  ఎలాంటి కూర్పు జ‌రిగింది?  అనే విష‌యాల‌పై నాయ‌కుల‌కుక్లారిటీ వ‌చ్చేసింది. దీంతో జిల్లాల్లో రాజకీయాలు మారుతున్నాయి. ఇప్ప‌టికీ.. ఇత‌మిత్థంగా పార్టీ అధిష్టానం నుం చి ఎలాంటి ప్ర‌క‌ట‌న రాక‌పోయినా.. ఎమ్మెల్యేల‌కు సంబంధించి ఇంటిలిజెన్స్ విభాగం సేక‌రించిన స‌మా చారం మేర‌కు.. ఎంపిక జాబితా విష‌యంపై ఎమ్మెల్యేల మ‌ధ్య చ‌ర్చ జ‌రుగుతోంది.

ఇప్ప‌టికే బెంగ‌ళూరు, చెన్నైలో కొంద‌రు నాయ‌కులు క్యాంపు రాజ‌కీయాలు చేస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నా యి. ఈ క్యాంపుల్లో సుమారు 35 మంది ఎమ్మెల్యేలు ఉన్నార‌ని తెలుస్తోంది. వీరంతో కొంద‌రు సీనియ‌ర్ ఎ మ్మెల్యేల నేతృత్వంలో ఈ శిబిరాలు న‌డుస్తున్నాయ‌ని.. పార్టీలో చ‌ర్చ సాగుతోంది. ముఖ్యంగా వీరి డి మాండ్ ఏంటంటే. రెడ్డి వ‌ర్గానికి ప్రాధాన్యం ఇవ్వాల‌నేదే! ఎందుకంటే.. గ‌త ఎన్నిక‌ల్లో పార్టీని అధికారం లోకి తీసుకురావ‌డంలో... రెడ్డి సామాజిక వ‌ర్గం కీల‌క పాత్ర పోషించింది. జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కావాలం టూ.. ప్ర‌య‌త్నాలు చేశారు.

గ‌త ప్ర‌భుత్వం త‌మ‌ను ప‌ట్టించుకోలేదు.. అదేస‌మ‌యంలో త‌మ వ్యాపారాలు కూడా దెబ్బ‌తిన్నాయి. ఈ నేప‌థ్యంలోనే రెడ్డి ప్ర‌బుత్వం ఏర్పాటు కావాల‌ని.. ఆశించారు. ఆదిశ‌గా ప‌నిచేశారు. ప్ర‌భుత్వం ఏర్ప‌డిం ది. అయితే.. గ‌తంలో క‌న్నా.. ఘోరంగానే ఇప్పుడు ప‌రిస్థితి ఉంద‌ని వారు చెబుతున్నారు. అంతేకాదు.. క‌నీసం మంత్రివ‌ర్గంలోనూ చోటు ద‌క్క‌డం లేద‌ని.. ప్రాధాన్యం అంత‌క‌న్నా ఉండ‌డం లేద‌ని.. వాపోతున్నా రు. ఇదే తీవ్ర అసంతృప్తుల‌కు దారితీస్తోంది. అంతేకాదు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ప్ర‌భావం చూపించే దిశ‌గా నాయ‌కులు అడుగులు వేస్తుండ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం అయింది.

``ఏ ప్ర‌భుత్వం అయితే .. ఏంటి?  మాకు ఏదో జ‌రుగుతుంద‌ని అనుకున్నాం. ఇప్పుడు ఏ ఒక్క ప‌నీ చేయ డం లేదు. మ‌మ్మ‌ల్ని న‌మ్ముకున్న వారికి కూడా ఏమీ చేయించ‌లేక పోతున్నాం.ఇలాంట‌ప్పుడు.. ఏ ప్ర‌భుత్వ‌మైతే ఏంటి?`` అని లోలోనే నాయ‌కులు మ‌ధ‌న ప‌డుతున్నారు. ఇది.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తీవ్ర‌ప‌రిణామాల‌కు దారితీసే అవ‌కాశం ఉంద‌ని.. ప‌రిశీల‌కులు చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. ఏదేమైనా... అన్ని వ‌ర్గాల కంటే. కూడా రెడ్డి సామాజిక వ‌ర్గం అండ ఇప్పుడు జ‌గ‌న్‌కుఎంతో అవ‌స‌రం అనేది వాస్త‌వం.

మరింత సమాచారం తెలుసుకోండి: