కర్ణాటకలో 2018 సంవత్సరంలో ఎన్నికలు జరిగితే 104 స్థానాలతో బీజేపీ అగ్రస్థానంలో నిలిచింది. కానీ మ్యాజిక్ ఫిగర్ కు కాస్త దూరంలో నిలిచారు. దీంతో బీజేపీని ఎలాగైనా అధికారానికి దూరంగా ఉంచాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. 80 స్థానాలతో రెండో స్థానంలో నిలిచినా జేడీఎస్ తో పొత్తు పెట్టుకుని రాష్ట్రంలో అధికారం చేపట్టింది. కేవలం 37 స్థానాల్లో గెలుపొందిన జేడీఎస్ పార్టీకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చి మరి సత్కరించింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్పకు సీఎం పదవి ఎలాగైనా రాకుండా చేయాలని ముమ్మర ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత జరిగిన ఎంపీ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎక్కువ మంది ఎంపీలుగా గెలవడం. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి రావడంతో కర్ణాటక బీజేపీలో మరోసారి జోష్ కనిపించింది.


మళ్లీ కన్నడ నాట రాజకీయం మొదలైంది. పాతిక మందిని రాజీనామా చేయించి.. కాంగ్రెస్ జేడీఎస్ చివరకు గద్దె దిగింది. అనంతరం 25 మందిలో బీజేపీలో 17 మంది గెలిచారు. మిగతా వాళ్లకు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చింది బీజేపీ.  అలా కాంగ్రెస్, జేడీఎస్ నుంచి వచ్చిన వారికి ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ టికెట్లు ఇవ్వలేదు. ఏకంగా మాజీ ముఖ్యమంత్రికే టికెట్ ఇవ్వలేదు. మాజీ కేంద్ర మంత్రులకు కూడా టికెట్ ఇవ్వలేదు.


దీంతో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ కన్నడ నాట విజయ కేతనం ఎగుర వేస్తుందని నమ్మకంతో ఉన్నారు. జేడీఎస్ నాయకులు మాట్లాడుతూ.. 30 నుంచి 36 స్థానాలు జేడీఎస్ కు వస్తాయని కాంగ్రెస్ కు 90 స్థానాల వరకు వస్తాయని పొత్తుకు సిద్ధమేనని సంకేతాలు ఇస్తోంది. కానీ బీజేపీ నాయకులు పట్టుదలతో ఉన్నారు. 120 నుంచి 125 స్థానాలు గెలుచుకుని మళ్లీ కర్ణాటకలో విజయం సాధిస్తామని బలంగా విశ్వసిస్తున్నారు. కన్నడ నాట రాజకీయాలు ఇప్పుడు రసకందాయకంలో పడ్డాయి. ఓటర్లు ఎటు వైపు తీర్పునిస్తారో.. కమలం వికసిస్తుందా.. హస్తం అధికారం చేజిక్కించు కుంటుందా త్వరలోనే తేలనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: