
డిసెంబర్ 2023 లో ఎన్నికలు జరిగితేనే వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. 2024 లో ఎన్నికలు జరిగితే తెలుగుదేశం, జనసేన కలిపి అధికారంలోకి రావడానికి అవకాశం ఉంది. కేవలం బిజెపితో మాత్రమే జనసేన పొత్తు కలుపుకుంటే మాత్రమే వైఎస్ఆర్సిపి గెలుస్తుంది. మే 2024 ఎన్నికల విషయంలో ప్రభుత్వ వ్యతిరేకత ప్రధాన పాత్ర పోషించబోతుందని తెలుస్తుంది.
అభ్యర్థుల ఎంపిక విషయంలో తెలుగుదేశం పార్టీ రాజీ పడినా, లేట్ చేసినా వైఎస్ఆర్సిపి గెలిచే అవకాశం మెండుగా ఉంటుందని వీళ్ళ సర్వే ఇచ్చిన ఒక లెక్క. 2024 లో ఎన్నికలు జరిగితే వైఎస్సార్సీపీ 61 నుండి 70 స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుందని, తెలుగుదేశం పార్టీ 85 నుండి 95 స్థానాలకీ, జనసేన పార్టీ 7 నుండి 10 సీట్లకి వచ్చే అవకాశం ఉందని 31 స్థానాల్లో హోరాహోరీగా ఉంటుందని లెక్కవేశారు.
విశాఖపట్నం, అనకాపల్లి, పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాల్లో వైసీపీకి అసలు బోణీయే కొట్టదని, పార్వతీపురం, మన్యం, కడప, నంద్యాలలో టిడిపికి ఒక సీటు కూడా వచ్చే అవకాశం లేదని, విశాఖపట్నం, ఉమ్మడి గోదావరి, కృష్ణ, తిరుపతి జిల్లాలో తప్ప మిగిలిన చోట జనసేనకు ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదని చెప్తున్నారు.