స్టార్ హీరోల సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే చాలు అభిమానులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. అభిమాన హీరో సినిమా విడుదల అవుతుందంటే చాలు తమ సొంత పనినైనా వదిలేసి థియేటర్ల వద్ద హడావుడి చేస్తూ ఉంటారు అభిమానులు. అలాంటి వారి కోసం చాలా సందర్భాల్లో హీరోలు తమని ఏళ్ళతరబడి ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి అభిమానులకు ఏదైనా ప్రమాదం బారిన పడితే వారి కుటుంబాలకు తామున్నామంటూ అండగా నిలుస్తూ గొప్ప మనసు చాటుకుంటూ ఉంటారు కొంతమంది సినీ ప్రముకులు. ఈ సంప్రదాయ టాలీవుడ్లో ఎక్కువగా ఉందని చెప్పవచ్చు.


ఇప్పుడు ఇదే తరహాలో తమిళ హీరో సూర్య కూడా మరొకసారి తన గొప్ప మనసు చాటుకోని వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల సూర్య అభిమాని జగదీషన్ రోడ్డు ప్రమాదంలో మరణించారు ఈ విషయం తెలుసుకున్న సూర్య అతని ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అన్ని విధాలుగా ఆ కుటుంబానికి అండగా ఉంటానని తెలియజేశారు. తమిళనాడులో నాయక్కల్ జిల్లాకు చెందిన సూర్య అభిమాన సంఘం కార్యదర్శి ఇప్పుడు జగదీష్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక అతి చిన్న వయస్సులోనే రోడ్డుప్రమాదంలో ఈ వ్యక్తి మరణించడంతో అతని కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు.


ఈ విషయం తెలుసుకున్న హీరో సూర్య రాత్రికి రాత్రి అభిమాని ఇంటికి వెళ్లి అతని కుటుంబాన్ని పరామర్శించారు. హీరో సూర్య ప్రస్తుతం డైరెక్టర్ బాల దర్శకత్వంలో తన సొంత నిర్మాణంలోనే.. టుడి ఎంటర్టైన్మెంట్ పై ఒక సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఇటీవలే కన్యాకుమారిలో అందుకు సంబంధించి ఒక కీలకమైన షెడ్యూల్ని కూడా పూర్తి చేశారు. ఇక త్వరలోనే మరో షెడ్యుల్ ని గోవాలో ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. కానీ అంతలోనే సూర్య అభిమాని మరణించడంతో సూర్య కాస్త నిరుత్సాహంతో ఉన్నాడని చెప్పవచ్చు. ఇక సూర్య తీసుకున్న ఈ నిర్ణయం వల్ల తమిళ ఇండస్ట్రీలో కూడా అందరి ప్రశంసలు అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: