కరోనా అనంతరం అన్ని సినిమా ఇండస్ట్రీలకు అద్భుతమైన సినిమాలు వచ్చి హిట్ లను అందించి అధిక లాభాలను అందించాయి. కానీ ఒక్క బాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రం సాలిడ్ గా చెప్పుకునే హిట్ మాత్రం దక్కలేదు అని చెప్పాలి. గత రెండు వారాల ముందు రిలీజ్ అయిన "డాక్టర్ జి" సినిమా కథ పరంగా ఆకట్టుకున్నా, కలెక్షన్ లలో మాత్రం ఎఫెక్టివ్ గా లేదు. లేటెస్ట్ గా వచ్చిన కన్నడ మూవీ "కాంతారా" కన్నా ఎక్కువ స్థాయిలో వస్తున్నా అవి చెప్పుకోవడానికి మాత్రమే కానీ, రికార్డులు చెరిపే అంత కాదు. మరి దీపావళికి వచ్చే రెండు సినిమాలు అయినా బాలీవుడ్ ను కలెక్షన్ లతో నింపుతాయా అంటే... అవి కూడా అటకెక్కినట్లే కనిపిస్తోంది.

"రామ్ సేతు" అనే ఒక మిథాలీజికల్ కాన్సెప్ట్ తో గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అక్షయ్ కుమార్. ఈ సినిమా కూడా హిందుత్వం పరంగా మంచి కంటెంట్ తోనే వచ్చినా, అయితే సినిమాకు మాత్రం నెగటివ్ టాక్ రావడం కాస్త నిరాశను కలిగించింది. దీని కారణంగా ఈ సినిమాకు ఎక్కువ కలెక్షన్ లు వచ్చే అవకాశం మాత్రం లేదు అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అలా అక్షయ్ కుమార్ సినిమా సైతం బాలీవుడ్ కలను నెరవేర్చలేకపోయింది. ఆ తర్వాత అజయ్ దేవగణ్ , సిద్దార్ధ్ మల్హోత్రా మరియు రకుల్ ప్రీత్ లు నటించిన తమిళ అనధికారిక రీమేక్ మూవీని బాలీవుడ్ లో "థ్యాంక్ గాడ్" పేరుతో విడుదల చేశారు. సినిమాను చూసిన ప్రేక్షకులు సైతం పాజిటివ్ గా స్పందించినా ఆశించిన మేరకు ఓపెనింగ్ రాకపోవడంతో ఇది కూడా బాలీవుడ్ ఆశల్ని బుగ్గిపాలు చేసింది.  

దానితో ఇప్పుడు బాలీవుడ్ దృష్టి అంతా కూడా కత్రినా కైఫ్ నటిస్తున్న ఫోన్ బూత్ సినిమాపైనే నెలకొంది. ఈ సినిమాలో కత్రినా కైఫ్ ఎప్పుడూ నటించని ఒక పాత్రను చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ సినిమాలో ఇషాన్ ఖట్టర్ మరియు సిద్దాంత్ చతుర్వేది ల్లాంటి జూనియర్ లతో నటించింది. ఇందులో కత్రినా రొమాన్స్ ను పండించే ఒక దెయ్యం పాత్రలో నటిస్తుంది. కాగా ఇప్పటికీ ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పాటలు కూడా హిట్ అవడంతో సినిమా కూడా హిట్ అవుతుందని అంచనాలు ఉన్నాయి. మరి కత్రినా ఈ సినిమాతో బాలీవుడ్ కు బ్లాక్ బస్టర్ హిట్ ను అందిస్తుందా లేదా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: