రాను రాను వెండి తెర కన్నా బుల్లితెర మేలు అన్న నిర్ణయానికి వచ్చేసారు జనాలు అని మనం చెప్పొచ్చు వెండితెర అంటే కేవలం మూడు గంటలు ఎంటర్టైన్మెంట్.. అదే బుల్లితెర అంటే ప్రతిరోజు కొత్త టాస్కులు..

సరికొత్త రూల్స్ ..వల్గర్ పంచెస్ ..డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటాయంటూ జనాల మదిలో ఒక ముద్ర పడిపోయింది  బుల్లితెర పై. మరీ ముఖ్యంగా జబర్దస్త్ షో వచ్చిన తర్వాత బుల్లితెర పెర్ఫార్మెన్స్ మరింత ఎక్కువైందని చెప్పాలి. బుల్లితెరపై ప్రసారమవుతున్న షో లలో వన్ ఆఫ్ ద టాప్ షో శ్రీదేవి డ్రామా కంపెనీ. ప్రతి ఆదివారం ప్రసారమయ్యే ఈ షో లో వారానికోసారి కొత్త టాస్క్ తో జనాలను ఆకట్టుకుంటూ ఉంటారు.

జబర్దస్త్ కమెడియన్స్ ..మిగతా కొంతమంది కమెడియన్స్ తో ఈ షో నెట్టుకు వస్తున్నారు . కాగా రీసెంట్గా శ్రీదేవి డ్రామా కంపెనీకి సంబంధించిన ప్రోమో  కూడా విడుదలైంది. ఈ ప్రోమో చూసిన జనాలందరూ షాక్ అయిపోతున్నారు అంటా మరీ . దానికి మెయిన్ రీజన్ ఈ ప్రోమోలో హైపర్ ఆది ..గుండు కొట్టించుకున్నాడు . అస్సలు ఆయన ఎందుకు గుండు కొట్టించుకున్నాడు అన్నది తెలియాలంటే ఇ ఎపిసోడ్ పూర్తిగా చదవాల్సిందే.


టాస్క్ లో భాగంగా ప్రతి వారం లాగే శ్రీదేవి డ్రామా కంపెనీ ఈసారి సరికొత్త టైటిల్ 'చదివింపులు' అని ప్రేక్షకులు ముందుకు వచ్చింది. మధ్య మధ్యలో స్కిట్స్ వేస్తూ సరదాగా డాన్స్ చేస్తూ కమెడియన్స్ తో సరదాగా అల్లరి చిల్లరిగా సాగిపోతున్న ఎపిసోడ్లో  యాంకర్ రష్మీ నెంబర్ టాస్క్ ఇచ్చింది . అంటే వాళ్ల చూస్ చేసుకున్న నెంబర్ కోడ్ వెనకాల ఏం వస్తే అది చేయాలి . అప్పుడే టాస్క్ లో విన్ అయినట్టు .మొదటిగా హైపర్ ఆది నెంబర్ 9 సెలెక్ట్ చేసుకున్నాడు . అందులో 30 సెకండ్ల పాటు కిస్ చేయాలి అని రాసి ఉంటుంది.

 

దీంతో వెంటనే నటి ఐశ్వర్య వైపు చూస్తూ కిస్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆమె అక్కడి నుంచి పారిపోవడంతో ఆ టాస్క్ ఫెయిల్ అవుతాడు  మరీ. అంతే కాదు మరో నెంబర్ చూస్ చేసుకోమనగా ..ఆ టాస్క్ లో ఆదికి గుండు కొట్టించుకోవాలి అని ఉంటుంది .దీంతో ఇంద్రజ వద్దు లైట్ తీసుకో అని చెప్తున్నా సరే హైపర్ ఆది టాస్క్ కోసం ఏమైనా చేస్తా అంటూ గుండు కొట్టించుకోవడానికి సిద్ధపడ్డాడు. అక్కడ ఉన్న బుల్లెట్ భాస్కర్ నరేష్ మిగతా ఆర్టిస్టులు అందరూ కలిసి ఆదికి గుండు కొట్టారు అని చెప్పొచ్చు. ఈ విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . అయితే నిజంగానే హైపర్ ఆది గుండు కొట్టించుకున్నాడ..? లేదా అన్ని ఎపిసోడ్స్ లాగే ఇది కూడా కేవలం పబ్లిసిటీ పాపులారిటీ కోసమే అలా క్లిప్స్ యాడ్ చేశారా..? అన్నది తెలియాలి అంటే డిసెంబర్ 4న ఆదివారం మధ్యాహ్నం ప్రసారమయ్యే ఎపిసోడ్ వరకు మనం వెయిట్ చేయాల్సిందే మరీ.

మరింత సమాచారం తెలుసుకోండి: