పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న హరిహర వీరమల్లు మూవీ లోను , హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ లోను , సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న "ఓజి" మూవీ లోను నటిస్తున్నాడు. అలాగే సముద్ర ఖని దర్శకత్వంలో రూపొందినటు వంటి వినోదయ సీతం మూవీ కి రీమేక్ గా రూపొందుతున్న సినిమాలో కూడా పవన్ నటించాడు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన తన షూటింగ్ భాగాన్ని పవన్ పూర్తి చేసుకున్నాడు. పవన్ ప్రస్తుతం ఎక్కువ శాతం ఉస్తాద్ భగత్ సింగ్ ... ఓజి మూవీ లపై ఫోకస్ పెట్టాడు.

 అలాగే ఈ రెండు మూవీ లలో షూటింగ్ లలో వరుసగా పాల్గొంటూ వస్తున్నాడు. ఇది ఇలా ఉంటే పవన్ ... హరీష్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి అయ్యింది. మరికొన్ని రోజుల్లో ఈ మూవీ రెండవ షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది. శ్రీ లీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... మైత్రి సంస్థ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

 ఇది ఇలా ఉంటే మే 11 వ తేదీన ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి ఫస్ట్ గ్లిమ్స్ వీడియోను విడుదల చేయనున్నట్లు కొన్ని రోజుల క్రితం ప్రకటించిన విషయం మన అందరికీ తెలిసిందే. అలాగే నిన్న ఈ మూవీ యొక్క ఫస్ట్ గ్లిమ్స్ వీడియోను సంధ్య 35 ఏం ఏం థియేటర్ లో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది. అలాగే మరోసారి ఈ మూవీ ఫస్ట్ గ్లిమ్స్ వీడియోకు సంబంధించిన మరో అప్డేట్ ను ఈ మూవీ యూనిట్ ప్రకటించింది. ఈ మూవీ ఫస్ట్ గ్లిమ్స్ వీడియోను రేపు సాయంత్రం 4 గంటల 59 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: