ఎన్.టి.ఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు దేవర టైటిల్ పెట్టారు. యువసుధ ఆర్ట్స్, ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీ స్థాయిలో రిలీజ్ ఉండబోతుంది. ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎన్.టి.ఆర్ నుంచి వస్తున్న సినిమా కాబట్టి సినిమాపై మామూలుగానే అంచనాలు ఒక రేంజ్ లో ఉంటాయి. అయితే ఈ సినిమా టైటిల్ విషయంలో పవర్ స్టార్ ఫ్యాన్స్ కొద్దిగా హర్ట్ అయినట్టు ఉన్నారు. అలా ఎందుకు అంటే దేవర టైటిల్ పవన్ సినిమాకు చూస్తాం అనుకున్న వారి ఆశలకు బ్రేక్ పడినట్టు అయ్యింది.

పవన్ వీరాభిమాని అయిన బండ్ల గణేష్ పవన్ ని తన సోషల్ మీడియాలో దేవర అంటూ పిలుస్తుంటాడు. ఇదేదో టైటిల్ బాగుంది సోదరా అంటే వెంటనే తన పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ లో దేవర టైటిల్ రిజిస్టర్ చేయించాడు. పవన్ తో ఫ్యూచర్ లో ఎప్పుడైనా సినిమా చేస్తే దానికి దేవర టైటిల్ పెట్టాలని అనుకున్నాడు. కట్ చేస్తే ఆ టైటిల్ కాస్త ఎన్.టి.ఆర్ 30వ సినిమాకు ఫిక్స్ చేశారు. బండ్ల గణేష్ సైతం నా దగ్గర నుంచి ఈ టైటిల్ కొట్టేశారు అన్నట్టుగా చెప్పాడు. అసలైతే ఒక బ్యానర్ లో రిజిస్టర్ చేయించిన టైటిల్ అంత ఈజీగా టేకోవర్ చేయడం జరగదు.

అయితే ఒక బ్యానర్ లో రిజిస్టర్ చేయించిన టైటిల్ కు సర్ టైన్ టైం లిమిట్ ఉంటుంది కాబట్టి దేవర టైటిల్ బండ్ల గణేష్ తన నుంచి చేజారిన విషయాన్ని కూడా గమనించలేకపోయారు. ఆల్రెడీ టైటిల్ వెళ్లిపోయింది కాబట్టి పవన్ మాత్రమే కాదు ఎన్.టి.ఆర్ కూడా నా దేవరే అంటూ కొత్త మాట చెప్పాడు బండ్ల గణేష్. మరి బండ్ల గణేష్ ఇలా షాక్ ఇస్తాడని ఊహించని మెగా, పవర్ ఫ్యాన్స్ అంతా కూడా ఏం చేయాలో తోచక సైలెంట్ అయిపోయారు.


మరింత సమాచారం తెలుసుకోండి: