మెగా గా హీరో ల్లో ఒకరైన వరుణ్ తేజ్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారని తెలుస్తుంది.మెగా బ్రదర్ నాగ బాబు తనయుడు వరుణ్ తేజ్ క్యూట్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం జూన్ 9న హైదరాబాద్ లో జరగనుందని సమాచారం.

ఈ నిశ్చితార్థ వేడుక కు కుటుంబ సభ్యులు, కొంతమంది అతిథుల ను మాత్రమే ఆహ్వానించినట్లు తెలుస్తుంది.ఈ ఏడాది చివర్లో వీరి పెళ్లి జరగనున్నట్లు సమాచారం.. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న వీరిద్దరు జూన్ 1 న హైదరాబాద్ చేరుకోనున్నారని తెలుస్తుంది.ఆ తర్వాత వీరిద్దరి నిశ్చితార్థంపై మెగా ఫ్యామిలీ అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం కూడా ఉంది.

వరుణ్ తేజ్ ఇటీవల ఇటలీ లోని రోమ్ నుండి ఫోటోల ను కూడా పోస్ట్ చేసాడు. ఇక లావణ్య కూడా తాను పర్యటన లో ఉన్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో వీరిద్దరు కలిసే ప్రయాణాలు చేస్తున్నారంటూ నెటిజన్స్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఈ క్రమం లో ఇప్పుడు వీరిద్దరి నిశ్చితార్థం డేట్ ఫిక్స్ అయ్యిందంటూ వార్త బయటకు వచ్చింది.

ఇదిలా ఉంటే.. వీరిద్దరు కలిసి మిస్టర్ అనే మూవీ లో నటించారు.. డైరెక్టర్ శ్రీను వైట్ల తెరకెక్కించిన ఈ పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. అయితే ఈ షూటింగ్ సమయం లో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారినట్లు సమాచారం.. అప్పటి నుంచి వీరు ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వైరలయ్యాయి. ఇక ఇప్పుడు వీరిద్దరు పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారని తెలుస్తుంది.వరుణ్ తేజ్ ఇటీవల గని సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. వెంకటేష్ తో మరోసారి కలిసి నటించిన సినిమా f3సినిమా కూడా కొద్దిగా నిరాశ పరిచిందని సమాచారం. మరీ వరుణ్ తేజ తరువాత ఎలాంటి సినిమా తో రాబోతున్నాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: