ప్రముఖ మలయాళీ నటి హానిరోజ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇటీవల నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలో మీనాక్షి క్యారెక్టర్ లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది. ఎక్కడ చూసినా ప్రస్తుతం షాపింగ్ మాల్ ఓపెనింగ్ రెస్టారెంట్ ఓపెనింగ్స్ ప్రతి చిన్న ఈవెంట్లకి వెళుతూ మరింత పాపులారిటీని దక్కించుకుంది ఈమె. తన అందచందాలతో యూత్ ను ఆకట్టుకుంటుంది ఈమె. దాంతోపాటు గ్లామర్ ఫోటోషూట్స్ సైతం చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. అలా ఫాలోవర్స్ ని పెంచుకుంటూ పోతున్న హనీ రోజ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. 

ఇందులో భాగంగానే తాను ఎదుర్కొన్న బాడీ షేవింగ్ పై కొన్ని ఎమోషనల్ కామెంట్స్ చేసింది . ఈ క్రమంలోని ఈమె మాట్లాడుతూ 2018 లో డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య 50వ చిత్రం ఆలయ సినిమాను తెలుగులో తెరకెక్కించారు.అయితే ఈ సినిమాలో హీరోయిన్గా ముందుగా అని రోజుని అనుకున్నారట. ఇక తెలుగులో ఈ సినిమాతోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. దాని అనంతరం 2014లో వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన ఈ వర్షం సాక్షిగా అనే సినిమాలో కూడా నటించింది. అయితే ఈమె రెండు సినిమాల్లో నటించినప్పటికీ ఆ రెండు సినిమాలు కూడా ఆమెకి పెద్దగా గుర్తింపును తెచ్చి పెట్టలేదు. కనీసం ఈ రెండు సినిమాలతో ఆమెని ఎవరు గుర్తుపట్టలేదు కూడా.

కానీ ఇటీవల నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాతో అత్యంత ఆదరణను పొందింది ఈమె. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ బాడీ షేమింగ్ కి గురైనప్పుడు తాను ఎంతో బాధపడ్డాను అని నేను కెరియర్ మొదట్లో ఒక టీవీ షో కి హాజరయ్యానని చెప్పుకొచ్చింది.ఇక ఆ షోలో పాల్గొన్నప్పుడు అక్కడ చూడడానికి వచ్చిన చాలామందిలో ఒక యువకుడు అందరి ముందు తన బాడీ షేవింగ్ గురించి దారుణమైన కామెంట్స్ ను చేశాడని చెప్పింది. అలా నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటే కూడా ఆ యాంకర్ ఏమాత్రం పట్టించుకోకుండా పగలబడి నవ్వింది అంటూ చెప్పుకొచ్చింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: