ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా అటు నందమూరి, మెగా హీరోల మధ్య మాత్రం ఎప్పుడూ ఆరోగ్యకరమైన పోటీ కొనసాగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు నందమూరి బాలకృష్ణ, చిరంజీవి ఇలా బాక్సాఫీస్ వద్ద ఎన్నోసార్లు పోటీపడ్డారు. ఎన్నోసార్లు ఒకరిపై ఒకరు పై చేయి సాధించారు. కానీ ఇప్పటికీ బాలకృష్ణ, చిరంజీవి మధ్య మంచి స్థానిహిత్య సంబంధం కొనసాగుతూ ఉంటుంది. ఇద్దరూ ఎక్కడ కలిసినా ఎంతో ఆప్యాయంగా పలకరించుకోవడం చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడుతరం హీరోలలో నందమూరి హీరో ఎన్టీఆర్ మెగా హీరో రామ్ చరణ్ మధ్య ఇలాంటి సాన్నిహిత్యమే ఉంది. బాలకృష్ణ, చిరంజీవిల కంటే ఇక ఇప్పుడు ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రాణ స్నేహితులు అని చెప్పాలి. ఇటీవల ఇద్దరు స్నేహితులు కూడా త్రిబుల్ ఆర్ సినిమాలో నటించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఫ్రెండ్షిప్ చూసిన తర్వాతే తనకు త్రిబుల్ ఆర్ సినిమా తీయాలని ఆలోచన వచ్చింది అంటూ జక్కన్న చెప్పాడు అంటే వీరి మధ్య స్నేహబంధం ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే ఇక అటు మెగాస్టార్ చిరంజీవిని, జూనియర్ ఎన్టీఆర్ ఎంతో అమితంగా అభిమానిస్తూ గౌరవిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే చిరంజీవి నటించిన సినిమాల్లో ఇక తన ఫేవరెట్ సినిమా ఏది అన్న విషయాన్ని ఒకానొక సమయంలో చెప్పుకొచ్చారు జూనియర్ ఎన్టీఆర్. అయితే ఇలా ఎన్టీఆర్ కి నచ్చిన చిరంజీవి సినిమా అనగానే ఏదో బ్లాక్ బస్టర్ మూవీ అయ్యుంటుంది అని అందరూ భావిస్తారు. కానీ ఇక చిరంజీవి కెరియర్ లో పెద్దగా సూపర్ హిట్ సాధించని రుద్రవీణ సినిమా అంటే తనకు ఎంతో ఇష్టమంటు చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్, చిరంజీవి గారు ఒక స్టార్ హీరో అయి ఉండి కూడా అలాంటి సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. ప్రతి నటుడుకి ఉండాల్సిన తపన అది. మనలోని నటుడిని సంతృప్తి పరచడం అనేది చాలా కష్టమైన పని అంటూ ఎన్టీఆర్ గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: